144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళాకి( Maha Kumbh Mela ) జనం పోటెత్తుతున్నారు.త్రివేణి సంగమంలో( Triveni Sangam ) పుణ్య స్నానాలు చేస్తున్నారు.
కొందరు చనిపోయిన వాళ్ల ఫొటోలు తెస్తే, ఇంకొందరు పెంపుడు కుక్కల్ని కూడా తీసుకొచ్చారు.కానీ, ఒక వ్యక్తి మాత్రం ఎవరూ ఊహించని పని చేసి అందరి కళ్లు తనవైపు తిప్పుకున్నాడు.
అతగాడు చేసిన పని చూస్తే షాక్ అవ్వడం ఖాయం.ఏకంగా తన మొబైల్ ఫోన్‌నే( Mobile Phone ) పవిత్ర నదిలో ముంచేశాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం తన ఫోన్ పాపాలు చేసిందని, అందుకే దాన్ని శుద్ధి చేయాలని చెబుతున్నాడు.
అతను కేవలం బాక్సర్లు మాత్రమే వేసుకుని నదిలోకి దిగాడు.చేతిలో ఫోన్ పట్టుకుని, తనే స్నానం చేయకుండా, ఫోన్‌ని మాత్రం నీళ్లలో ముంచాడు.దేవుడికి అభిషేకం చేసినట్టు, ఫోన్‌కి పవిత్ర స్నానం చేయిస్తున్నాడు ఆ భక్తుడు.
ఈ సీన్ చూసినవాళ్లంతా అవాక్కయ్యారు.మొదట్లో ఇది కుంభమేళాలో స్నానం చేస్తున్న వీడియో అనుకున్నారు.కానీ కాసేపటికి అసలు విషయం తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు.
ఫోన్‌కి స్నానాలా ఏంటి అని ముక్కున వేలేసుకున్నారు.
కుమార్ కౌశల్ సాహు అనే వ్యక్తి ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.“మొబైల్ భీ బహుత్ పాప్ కా హక్దార్ హై” (మొబైల్‌కి కూడా చాలా పాపాలుంటాయి, మొబైల్‌కి కూడా మోక్షం రావాలి కదా) అని క్యాప్షన్ పెట్టాడు.అంతేకాదు, అందరూ తమ ఫోన్లను కూడా నదిలో కడగాలని సలహా ఇస్తున్నాడు ఈ వింత భక్తుడు.
ఇంటర్నెట్‌లో ఈ వీడియో చూసిన జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.కొందరైతే “ఇక ఫోన్‌కి మోక్షం వచ్చేసినట్టే, పర్మనెంట్‌గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది” అని జోకులు పేల్చుతున్నారు.ఇంకొక నెటిజన్ అయితే ఒక అడుగు ముందుకేసి “క్రోమ్ బ్రౌజర్ చేసిన పాపాలన్నీ కడిగేసాడుగా” అని ఫన్నీ కామెంట్ పెట్టాడు.
ఫిబ్రవరి 13న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 2.8 లక్షల వ్యూస్ వచ్చాయి.లైకులు, కామెంట్లు, షేర్లతో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
నవ్వుతున్న ఎమోజీలతో నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.