డార్క్ సర్కిల్స్.అత్యంత సర్వ సాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.
పురుషులు డార్క్ సర్కిల్స్ గురించి పెద్దగా పట్టించుకోరు.కానీ అమ్మాయిలు మాత్రం వీటిని చూడగానే తెగ హైరానా పడుతుంటారు.
ఎందుకంటే ఇవి అందాన్ని దారుణంగా చెడగొడతాయి.అందుకే డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీమ్, సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న బంగాళదుంప( Potato )ను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును మరియు చిన్న కీర దోసకాయ( Cucumber)ను కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, నిమ్మ పండు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా పావు టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి నాలుగైదు నిమిషాల పాటు కలుపుకోవాలి.తద్వారా మంచి సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించడానికి ముందు మరియు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు తయారు చేసుకున్న సీరం ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
<img src=" https://telugustop.com/wp-co
ntent/uploads/2023/07/Homemade-serum-dark-circles-removing-serum-Almond-Oil-dark-circles-Copy.jpg”/>
ఈ హోమ్ మేడ్ సీరంను రోజుకు రెండుసార్లు కనుక వాడితే డార్క్ సర్కిల్స్ దెబ్బకు మాయం అవుతాయి.కొద్దిరోజుల్లోనే కళ్ళ చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గు ముఖం పడతాయి.కాబట్టి డార్క్ సర్కిల్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన విధంగా ఇంట్లోనే సీరం ను తయారు చేసుకుని వాడండి.
బెస్ట్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది.