పొడి చర్మంతో దిగులొద్దు.. రోజు నైట్ ఈ ఆయిల్ ను వాడితే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే!

సాధారణంగా కొందరి ముఖ చర్మం చాలా డ్రై గా ఉంటుంది.ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ వాడిన కూడా వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది.

 This Homemade Face Oil Helps To Get Rid Of Dry Skin! Homemade Oil, Face Oil, Lat-TeluguStop.com

ఆ తర్వాత మళ్లీ చర్మం పొడి పొడిగా మారి దురద పెడుతుంది.ఈ సమస్యతో మీరు కూడా దిగులు చెందుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ ఆయిల్ ను రాసుకుంటే మీ పొడి చర్మం సమస్యకు పరిష్కారం దొరికినట్లే అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు ( Organic turmeric )వేసుకోవాలి.అలాగే చిటికెడు కుంకుమ పువ్వు( Saffron flower ) కూడా తీసుకోవాలి.ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive oil ), రెండు టేబుల్ స్పూన్లు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకుని తయారు చేసుకున్న ఆయిల్ ను ముఖానికి రాసుకోవాలి.

అనంతరం కనీసం ఐదు నిమిషాల పాటు మంచిగా ఫేస్ మసాజ్ చేసుకుని పడుకోవాలి.రోజు ఈ విధంగా కనుక చేశారంటే పొడి చర్మం అన్న మాటే అనరు.ఈ ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

స్కిన్ డ్రై అవ్వకుండా అడ్డుకుంటుంది.చ‌ర్మాన్ని స్మూత్ గా మ‌రియు షైనీ గా మెరిపిస్తుంది.

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల చర్మం పై ముడతలు ఏమైనా ఉంటే క్ర‌మంగా మాయం అవుతాయి.స్కిన్ టైట్ గా మారుతుంది.

యవ్వనంగా కనిపిస్తుంది కాబట్టి పొడి చర్మం తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube