ఎంత మాట అన్నావ్ నయన్..ఆ రోజుల్లో అవే నీకు చాలా ఎక్కువ

నా కెరియర్ లో నేను చేసిన అత్యంత చెత్త పాత్ర అదే అని నయనతార ( Nayanthara )చెప్పగానే మీడియా దొరికిందే బంగారం అన్నట్టుగా ఎవరికి నచ్చింది వారు రాసేసుకున్నారు.కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా నయన్ చేసిన చెత్త పాత్ర అంటూ హడావిడి చేశారు.

 What Is This Nayan , Nayanthara, Malayalam Film Industry, Chandramukhi, Jyotika-TeluguStop.com

ఇప్పుడు నయనతార సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఇందులో ఎలాంటి సందేహం లేదు.ఆమె నటనలో ఆమె తీసుకుంటున్న నిర్ణయాలలో, ఆమె పాత్ర సెలక్షన్ లో మహా అద్భుతం దేనిని ఎవ్వరూ ప్రశ్నించలేరు.

అయితే ఇవన్నీ ప్రస్తుతం.గతంలోకి వెళితే ఆమెకు అసలు అవకాశాలు ఇచ్చే రోజులు కూడా కావు అవి. మలయాళ సినిమా ఇండస్ట్రీ( Malayalam Film Industry ) ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

Telugu Chandramukhi, Diana Mariam, Jyotika, Malayalam, Nayanthara, Nayan-Telugu

ఆమెకు మొదట ఒక బలమైన పాత్ర దొరికింది అంటే అది చంద్రముఖి( Chandramukhi ) ద్వారానే రజనీకాంత్ కు ప్రియసి పాత్రలో నటించింది.అసలు ఆ సినిమాలో రజనీకాంత్ హీరో కాదు… నయనతార హీరోయిన్ కాదు, ప్రభు అంతకన్నా కాదు.కేవలం అది జ్యోతిక సినిమా( Jyotika movie ).జ్యోతికకు మాత్రమే మంచి పేరును తీసుకొచ్చిన సినిమా.ఇక రజనీకాంత్ సినిమాలో నటించడం అనే ఆప్షన్ ని నయనతార ఎలా వదులుకుంటుంది చెప్పండి.

ఆ తర్వాత మురగదాస్ గజిని సినిమా.ఇందులో ఆమెకు పాత్ర దొరకడం చాలా పెద్ద విషయం మురుగదాస్ లాంటి దర్శకుడు చేతిలో పడింది.

హీరోయిన్ ఆమె కాదు అసిన్.అన్నీ తెలిసి చేసింది.

ఇప్పుడు చాలా సింపుల్ గా అది చెత్త సెలెక్షన్ అంటూ కొట్టేస్తోంది.

Telugu Chandramukhi, Diana Mariam, Jyotika, Malayalam, Nayanthara, Nayan-Telugu

ఆ రోజుల్లో అవి ఇవ్వడమే ఆమెకు గొప్ప ఒక మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన డయానా మరియం ఆ రోజుల్లో అవి ఇవ్వడమే ఆమెకు గొప్ప ఒక మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన డయానా మరియం( Diana Mariam ) అనే సిరియన్ క్రిస్టియన్ అమ్మాయికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దొరికాయి.అవి చెత్త పాత్రలే అయినా ఆమెకు గుర్తింపు తెచ్చిన పాత్రలు కూడా అవే.ఆమెకు 2010లో అదుర్స్ ఆ తర్వాత శ్రీరామరాజ్యం సినిమాలు వచ్చేవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే తగిన ప్రాధాన్యత దొరకలేదు.ఇప్పుడు అలా ఆమెకు ఎంట్రీ ఇచ్చిన మంచి సినిమాల గురించి నోరు పారేసుకోవడం వల్ల నయన్ సాధించేది ఏమీ లేదు.ఇన్నేళ్ల పాటు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఆ దర్శకులను అలా అనడంలో అర్థం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube