వైరల్ : భాగస్వామి లేకుండానే 14 పిల్లలను కన్న కొండ చిలువ..

ప్రస్తుతం సోషల్ మీడియా ( Social media )ద్వారా జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు జంతువులకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు.

 Male Python Welcomes 14 Babies Despite No Contact With Other Snakes ,python, Vi-TeluguStop.com

తాజాగా ఒక కొండచిలువ ఎలాంటి భాగస్వామి లేకుండా గర్భం దాల్చి ఏకంగా 14 మంది పిల్లలకు ఇచ్చిన సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఈ సంఘటన ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది.

Telugu England, Latest, Python, Virgin-Latest News - Telugu

ఇది ఇలా ఉండగా మరోవైపు మగ కొండచిలువతో ఎలాంటి సంబంధం లేకుండా పిల్లలను ఎలా జన్మనిచ్చిందన్న ప్రశ్న మొదలైంది అక్కడి అధికారులకు.ఈ కొండచిలువకు దాదాపు 9 సంవత్సరాల క్రితం ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియన్ రోనాల్డో పేరును ఈ కొండచిలువకు పెట్టారు.వాస్తవానికి ఇన్ని రోజులు రోనాల్డో మగ కొండచిలువుగా అనుకున్నారు.అయితే, ఇప్పుడు ఈ విచిత్రం ఏమిటంటే.ఈ కొండ చిలువ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అది మగ కొండచిలువ కాదని, ఆడ కొండచిలువ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు అక్కడి వారు.సహజంగా మగ జీవులు ఎలా గర్బం ధాలుస్తాయని ఎవరైనా ఆశ్చర్యపోతూ ఉంటారు.

కానీ., వాస్తవానికి 9 ఏళ్ల క్రితం ఒక పశు వైద్యుడు కొండచిలువను మగదని ప్రకటించగా.

, ప్రస్తుతం జరిగిన సంఘటన ద్వారా ఆ కొండచిలువ ఆడదని తేలిపోయింది.

Telugu England, Latest, Python, Virgin-Latest News - Telugu

ఈ కొండచిలువ పైథాన్ జాతికి చెందిందని, ఈ కొండచిలువ ఇంగ్లాండ్( England ) లోని పోర్ట్స్‌మౌత్ కాలేజీలో నివాసం ఉంటూ పిల్లలను జన్మనిచ్చింది.ఇక కళాశాల జంతు సంరక్షకుడు పీట్ క్విన్లాన్( Quinlan ) ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతూ.ఈ కొండచిలువ గత తొమ్మిదేళ్లపాటు మగ కొండచిలువగా భావించి రక్షించాము.

కానీ ఇప్పుడు పిల్లలు పుట్టిన అనంతరం ఈ కొండచిలువ జెండర్ ఏమిటా అని ప్రశ్నలు తలెత్తాయని చెప్పుకొచ్చాడు.RSPCA అనే స్వచ్ఛంద సంస్థ నుంచి తొమ్మిది సంవత్సరాల క్రితం నుంచి ఈ కొండచిలువను రక్షించినట్లు కేర్ టేకర్ తెలియచేశాడు.

ఈ రకమైన పునరుత్పత్తిని పార్థినోజెనిసిస్ అంటారు.ఇది అలైంగిక పునరుత్పత్తికి సహజ రూపం.ఇక్కడ ఫలదీకరణం లేకుండా గుడ్డు పిండంగా అభివృద్ధి చెబుతుందట.ఇది మొక్కలు, ఆల్గే, కొన్ని అకశేరుకాలు (వెన్నెముక లేనివి)లతో పాటు కొన్ని సకశేరుక జంతువులలో ఏర్పడవచ్చు అని అధికారులు అంటున్నారు.

అయితే ఇలా కొండచిలువ జాతికి చెందిన కొండచిలువలు మగవాటితో సంబంధం లేకుండా పిల్లలకు జన్మనిచ్చిన సంఘటలు ఇప్పటి చాలా సార్లు చూసామని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube