టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రజనీకాంత్ ( Rajinikanth )అభిమానిగా కనిపించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.అయితే అప్పుడు ప్రభాస్ రజనీ అభిమానిగా నటిస్తే ఇప్పుడు రజనీకాంత్ కల్కి గురించి మెచ్చుకునే స్థాయికి ప్రభాస్ ఎదిగారు.
స్టార్ హీరో ప్రభాస్ సక్సెస్ స్టోరీ వింటే ఫిదా కావాల్సిందేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్( Prabhas ) రేంజ్ ఇదీ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కల్కి సీక్వెల్( Kalki sequel ) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రజనీకాంత్ పేర్కొన్నారు.కల్కి మూవీ అద్భుతంగా ఉందని ఇండియన్ సినిమాను నాగ్ అశ్విన్ ( Nag Ashwin )మరో స్థాయికి తీసుకెళ్లారని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
కల్కి మూవీలో నటించిన వారికి ఈ సినిమా కోసం పని చేసిన వారికి శుభాకాంక్షలు అని రజనీకాంత్ పేర్కొన్నారు.కల్కి సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పిన విషయాలు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
రజనీకాంత్ లాంటి వ్యక్తి చేత ప్రశంసలు పొందడం అంటే సాధారణ విషయం కాదని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరో స్టార్ హీరో నాగార్జున సైతం కల్కి మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.కల్కి సినిమా అమితాబ్ అసలు సిసలైన మాస్ హీరో అని నాగార్జున అన్నారు.అమితాబ్ నటనతో ఆశ్చర్యపరిచారని నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
కల్కి సీక్వెల్ లో కమల్ ను చూడటం కోసం వేచి చూస్తున్నానని నాగ్ తెలిపారు.ప్రభాస్ నువ్వు మరోసారి సత్తా చాటావంటూ నాగార్జున పేర్కొన్నారు.దీపికా పదుకొనే చాలా అద్భుతంగా నటించారని మీరంతా కలిసి ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి నిరూపించారని నాగ్ చెప్పుకొచ్చారు.రజనీ, నాగ్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.