తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సినిమాల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం పై సినీ పెద్దలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్( Allu Arjun ) సంధ్య థియేటర్ కు వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి నిండు సభలో తేల్చి చెప్పారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచమని క్లారిటీ ఇచ్చారు.అయితే ఇదే విషయం గురించి సినీపెద్దలు ముఖ్యమంత్రులతో భేటీ అయి మాట్లాడారు.
కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే ప్రసక్తి లేదని తెలిపారు.
ఇలా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పడంతో ఎంతో మంది సినీ పెద్దలు ఈ విషయంపై విమర్శలు కురిపిస్తున్నారు.ముఖ్యంగా తమ్మారెడ్డి భరద్వాజ్ ( Thamma reddy Bhardwaj ) అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ ఈగో కారణంగా ఈరోజు ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వం దగ్గర తలదించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఈయన అల్లు అర్జున్ పై విమర్శలు కురిపించారు.
ఇకపోతే తాజాగా మరోసారి బెనిఫిట్ షోల( Benefit shows ) గురించి తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ప్రీమియర్ షోల కోసం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి దేహి అని అడుక్కోవడం సరైనది కాదని తెలిపారు.ఒక సినిమాకు 100 కోట్ల రూపాయలకు కలెక్షన్స్ తగ్గితే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? అలాంటప్పుడు వెళ్లి అడుక్కోవడం దేనికి అంటూ ఈయన ప్రశ్నించారు.గతంలో ప్రీమియర్ షో లను ఎప్పుడు కూడా ఉచితంగానే ప్రదర్శించాము.
ఇటీవల సినిమా టికెట్లను పెట్టి వాటిని క్యాష్ చేసుకుంటున్నారు.ఆంధ్ర తెలంగాణ ప్రజలపై అదనపు భారం ఎందుకు? ఈ విషయం పట్ల మరోసారి అందరూ ఆలోచించాలి అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.