వైరల్ వీడియో.. సునీల్ గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి

బోర్డర్-గవాస్కర్( Border-Gavaskar ) ట్రోఫీ నాలుగో టెస్ట్‌లో టీమిండియా అద్భుతంగా పట్టు బిగిస్తోంది.నాలుగో రోజు ఆరంభం నుంచే భారత బౌలర్లు తమ మాయాజాలాన్ని చూపించి, ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను దెబ్బతీశారు.

 Nitish Kumar Reddy Father Of Sunil Gavaskar's Legs Transplanted In Viral Video,-TeluguStop.com

మొదటి ఇన్నింగ్స్ లో 369 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి( Nitish Kumar Reddy ) 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ లియన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అతని బ్యాటింగ్ ప్రదర్శన చూసి ప్రేక్షకులు, సహచరులు హర్షించారు.చివరకు మహమ్మద్ సిరాజ్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.

టీమిండియా పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ( Jasprit Bumrah, Mohammed Siraj )తమ అద్భుతమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను దెబ్బతీశారు.బుమ్రా ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ను పెవిలియన్‌కు పంపగా, సిరాజ్ ఉస్మాన్ ఖవాజాను క్లీన్ బౌల్డ్ చేశాడు.

స్టీవ్ స్మిత్ కూడా సిరాజ్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇలా మొత్తానికి వార్తలు అందేసరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.

మూడో రోజు హైలైట్‌గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డి తన టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.99 పరుగుల వద్ద ఫోర్ కొట్టి వంద రన్స్ పూర్తి చేసుకున్న నితీష్ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు.అతని తండ్రి ముత్యాల రెడ్డి స్టేడియంలో ప్రత్యక్షంగా ఈ గొప్ప క్షణాన్ని వీక్షించారు.నితీష్ కృషి పట్ల గర్వంతో ఉప్పొంగిపోయారు.అయితే, నేటి ఉదయం నితీష్ కుటుంబం టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్‌ను కలిసింది.ఈ సందర్భంగా నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి గవాస్కర్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

తన కొడుకును క్రికెట్‌లో స్థిరంగా నిలిపేందుకు చేసిన త్యాగాలను గవాస్కర్ ప్రశంసిస్తూ, ముత్యాల రెడ్డి భారత జట్టుకు విలువైన ఆటగాడిని అందించారని వ్యాఖ్యానించారు.

తన కొడుకును ప్రోత్సహించేందుకు ముత్యాల రెడ్డి ( Mutyala Reddy )ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారని తెలుసుకున్న గవాస్కర్, ఇది ఓ తండ్రి చేసిన గొప్ప త్యాగమని పేర్కొన్నారు.టీమిండియా జట్టుకు నితీష్ రూపంలో ఒక వజ్రంలాంటి ఆటగాడిని అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సంఘటన నితీష్ కుమార్ రెడ్డి కెరీర్‌లో మరిచిపోలేని క్షణంగా నిలిచింది.

స్టేడియంలో తండ్రి అభినందనలతో పాటు, గవాస్కర్ మాటలు నితీష్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube