టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ఇటీవలే దేవర మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి సక్సెస్ గా నిలిచింది.ఇప్పుడు అదే ఊపుతో ఎన్టీఆర్ మరిన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 సినిమాలో నటిస్తున్నారు.హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ ( Ayan Mukherjee )దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కేరెక్టర్ డ్యూయెల్ షేడ్స్ కనిపిస్తుందట.
అందులో ఒకటి దేశభక్తితో శత్రువు ఎంతటి వాడైనా సరే ఊచకోత కోసే ఇండియన్ ఆఫీసర్ గా ఉండగా, ఇంకొకటి పైకి చెడు కనిపించినా లోపల ఎమోషనల్ ఉండే కేరెక్టర్ లో ఎన్టీఆర్ కనిపిస్తారట.ఇలా ఈ సినిమాలో రెండు పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా వార్ 2 ( War 2 )కోసం ఎన్టీఆర్ సూపర్ మేకోవర్ అయ్యారు.
చాలా సన్నగా హ్యాండ్ సం గా తయారయ్యారు.ఈ చిత్రంలో యాక్షన్ కోసం ఎన్టీఆర్ మాములుగా కష్టపడలేదు.
హృతిక్,ఎన్టీఆర్ నడుమ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాదు.
ఈ ఇద్దరి కలయికలో వచ్చే పాట అన్ని ఒక రేంజ్ లో ఉండబోతున్నాయనే న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఈస్తోంది.ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకల కోసం లండన్ కు వెళ్లారు.తన భార్య ప్రణతి కుమారులు భార్గవ్ రామ్ అభయ్ రామ్ లతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పటికే అందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.ఈ లండన్ ట్రిప్ తర్వాత మళ్లీ యధావిధిగా వార్ 2 షూటింగ్లో పాల్గొనబోతున్నారు ఎన్టీఆర్.