ప్రస్తుతం వైసీపీ తరుపున మాజీ మంత్రి పేర్ని నాని ( former minister’s Nani )గొంతు వినిపిస్తున్నారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు వైసీపీ( YCP ) తరఫున ఆయనే సమాధానం చెబుతున్నారు .
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు, లోకేష్ వంటి వారిని విమర్శించేందుకు పేర్ని నానినే వైసిపి ముందుపెడుతోంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం కుంభకోణం కేసులో ఇరుక్కుంది.
ఇప్పటికే పేర్ని నానితో పాటు, ఆయన భార్య జయసుధ పైన కేసు నమోనమోదయింది.ఈ కేసులో పేర్ని నానిని ఏ 6 గా నమోదు చేశారు. కృష్ణాజిల్లా బందరు తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
ఈ కేసులో పేర్ని నానిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే ఈ కేసు వ్యవహారం తరువాత పేర్ని నాని పరారీలో ఉన్నట్లు సమాచారం.రేషన్ బియ్యం కుంభకోణంలో పేర్ని నాని ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం( Ration rice ) మాయం కేసులో వరుస అరెస్టులు జరుగుతున్నాయి.ఈ కేసు విచారణలో భాగంగా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గోడౌన్ మేనేజర్ మానస తేజను అరెస్ట్ చేశారు.ఈ కేసులో కోటిరెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాకపోతే రేషన్ బియ్యం మాయమైనట్లు తనపై అనుమానం రాకుండా ముందుగానే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇక రైస్ మిల్లర్ బుర్ర ఆంజనేయులు , లారీ డ్రైవర్ బోట్ల మంగారావు లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.వైద్య పరీక్షల అనంతరం ఎస్కార్ట్ వాహనంలో బందరు తాలూకా ఆఫీసు నుంచి కోర్టుకు తరలించారు .
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితులకు 12 రోజుల రిమాండ్ విధించారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.సోమవారం కృష్ణాజిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరించాలని పేర్ని జయసుధను జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.బందరు మండలం పోట్ల పాలెం సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద బఫర్ గోడౌన్ నిర్మించారు.వార్షిక తనిఖీ లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్ ను పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు.
అయితే ఆ గోడౌన్ లో ఉన్న బియ్యం నిల్వలకు అధికారిక పత్రాల్లో ఉన్న నిలువలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు .ప్రస్తుతం ఈ కేసులోనే పేర్ని నానిని అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.