బిగ్ బాస్ రియాలిటీ షో రోజు రోజుకీ పాపులారిటీ పెంచుకుంటూ పోతుంది.ఈ షోలో పాల్గొనాలనుకునే వారి సంఖ్య ఎంత ఉంటుందో, అవకాశం వచ్చిన వినియోగించుకోని వారి సంఖ్య కూడా అంతే ఉంటుంది.
అయితే ఈ షోలో పాల్గొనాలంటే కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ని పాటించాల్సి ఉంటుంది.అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనడం, ఎలిమినేట్ అవ్వడం లేదా విజేతగా తిరిగి రావడం మన అందరికి తెలుసు.
మరి ఈ షో నుంచి మధ్యలోనే బయటకు రావడం జరుగుతుందా ? రావాలంటే ఏం చేయాలి ? లేదా వారే పంపిస్తారా ? ఇలాంటి కొన్ని విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
వాస్తవానికి ఎలాంటి ఎమర్జెన్సీ కండిషన్ లో ఆయినా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం అసాధ్యం.బిగ్ బాస్ హౌస్ లో తమ ఇంటి వారితో మాట్లాడుకోవడానికి ఒక ఫోన్ సౌకర్యం ఉంటుందనే విషయం బయట ప్రపంచానికి తెలియదు.ఒకవేళ గనుక ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటి వారితో మాట్లాడుకోవచ్చు.
అలా మాట్లాడుకున్న విజువల్స్ బయటకు కనిపించవు.ఒకవేళ కనుక ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆ సమయంలో హౌస్ నుంచి సభ్యుడు బయటకు వెళ్ళిపోతే ఆ ఎపిసోడ్ పూర్తయ్యేవరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండితీరాలి.
ఒకవేళ గనుక ఎపిసోడ్స్ పూర్తి అవ్వకుండానే బయటకు వస్తే వారికి రావాల్సిన అమౌంట్ రాకపోగా తిరిగి బిగ్ బాస్ కి 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సి రావచ్చు.
తెలుగులో సీజన్ లో కూడా ఇప్పటికీ నూతన ప్రసాద్, ముమైత్ ఖాన్, సామ్రాట్ వంటి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి షో కి వచ్చిన వారే.నూతప్రసాద్ కి కాలు ఫ్రాక్చర్ కావడంతో కొన్ని రోజులపాటు హౌస్ నుంచి బయటకు వెళ్లి తిరిగి మళ్ళీ షో లో పాల్గొన్నాడు.అలాగే ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసులో సిబిఐ కి అటెండ్ అయి తిరిగి షోకి వచ్చింది.
ఇక సామ్రాట్ సైతం తనం మొదటి భార్య విడాకుల కేసు విషయంలో ఒక రోజు బయటకు వెళ్లాల్సి వచ్చింది.అయితే ఆరోగ్య పరంగా కాకుండా అక్కడ వాతావరణం పద్ధతులు నచ్చక షో నుంచి బయటకు వెళ్లాలనుకునే వారు మాత్రం ఏకంగా బిగ్ బాస్ కి 50 లక్షల రూపాయలు చెల్లించి తీరాలి.
ఇలాంటి పరిస్థితి సంపూర్ణేష్ బాబు కి రాగ తారక్ సహాయం చేసి ఆ పరిహారం లేకుండా చేసాడు.అలాగే సీజన్ 4 లో గంగవ్వ సైతం అక్కడ ఉండలేక బయటకు వచ్చింది.
కానీ నాగార్జున చొరవతో ఎలాంటి పరిహారం కట్టలేదు.అంతే కాదు నాగార్జున స్వయంగా ఆమెకు ఇల్లు కూడా కట్టించాడు.
కానీ అది అన్ని సార్లు కుదరదు కాబట్టి షో నుంచి బయటకు వెళ్లడం అనేది కుదరదు.