నెలసరి అంటేనే నొప్పుల మయం.నెలసరి నొప్పి కొందరిలో తీవ్రంగా ఉంటుంది.
నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్లు లాగేయడం(Back pain, stomach pain, leg cramps) వంటివి మొదటి రెండు రోజులు బాగా ఇబ్బంది పెడుతుంటాయి.వాటి నుంచి రిలీఫ్ పొందడం కోసం చాలా మంది పెయిర్ కిల్లర్స్ వాడుతుంటారు.
నెలసరి నొప్పిని తగ్గించుకోవడానికి పేయిన్ కిల్లర్స్ వేసుకోవడం సాధారణమే, కానీ వాటిని ఉపయోగించడంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
నెలసరి సమయంలో ప్రొస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి.
ఇవి గర్భాశయం సంకోచాలు అధికంగా ఉండటానికి కారణమతాయి.గర్భాశయం ఎక్కువగా సంకోచడం వల్ల రక్త ప్రసరణ తక్కువగా ఉండటంతో నొప్పి సంభవిస్తుంది.
అయితే నెలసరి నొప్పిని తగ్గించుకోవడానికి సొంత వైద్యం కాకుండా డాక్టర్ల సలహా తీసుకుని నొప్పి నివారణ మాత్రలను వినియోగించాలి.
వైద్య సలహా లేకుండా ఎక్కువగా లేదా నిరంతరం ఈ రకమైన మందులను ఉపయోగిస్తే పలు ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.గ్యాస్ సమస్యలు, లివర్, కిడ్నీ (Gas problems, liver, kidney)సంబంధిత సమస్యలు, మలబద్ధకం, అధిక రక్తపోటు వంటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు.అందుకే తక్కువ డోసేజ్‌లో సరైన పేయిన్ కిల్లర్ ఎంపిక చేయడం కోసం వైద్యుని సలహా తీసుకోవడం ఎంతో ఉత్తమం.
అలాగే ఖాళీ కడుపుతో పెయిర్ కిల్లర్స్ వేసుకోకూడదు.అల్లం టీ, గ్రీన్ టీ, పుదీనా టీ వంటి పానీయాలు నెలసరి సమయంలో శరీరాన్ని మరియు మెదడును శాంతపరుస్తాయి.పొత్తికడుపు భాగాన్ని సున్నితంగా మసాజ్ చేయడం, కడుపుపై హీట్ ప్యాడ్ ఉంచడం వంటి చేస్తే నొప్పి నుంచి సహజంగా రిలీఫ్ పొందవచ్చు.తేలికపాటి వ్యాయామం అంటే యోగా లేదా నడక చేయడం వల్ల కొంత ఉపశమనం పొందుతారు.
నెలసరి సమయంలో క్యాఫైన్, కొవ్వు పదార్థాలు తగ్గించి, పండ్లు, కూరగాయలు, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఆహారం తీసుకోండి.ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మెరుగైన ఉపశమనం అందిస్తుంది.