2024 సంవత్సరంలో లెక్కకు మిక్కిలి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.ఈ సినిమాలలో 10 శాతం సినిమాలు సక్సెస్ సాధించగా మెజారిటీ సినిమాలు( Majority movies ) ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో బెస్ట్ సినిమా ఏదనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.అయితే జాన్వీ కపూర్( Janhvi Kapoor ) మాత్రం ఈ ఏడాది బెస్ట్ సినిమా అమరన్ ( Amaran )అని కామెంట్లు చేయడం గమనార్హం.
అమరన్ మూవీ దీపావళి పండుగ ( Diwali festival )కానుకగా థియేటర్లలో విడుదలై అంచనాలకు మించి సక్సెస్ సాధించింది.మేజర్ ముకుంద్ వరదరాజన్ (Major Mukund Varadarajan )జీవితకథతో ఈ సినిమా తెరకెక్కింది.
తమిళనాట ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమా సక్సెస్ సాధించింది.జాన్వీ కపూర్ అమరన్ సినిమా గురించి రివ్యూ ఇవ్వడం గమనార్హం.
అమరన్ సినిమా చూడటం చాలా ఆలస్యమైందని ఈ సినిమాలో ప్రతి సీన్ ఎమోషన్స్ తో నిండి ఉందని జాన్వీ చెప్పుకొచ్చారు.ఒక మంచి సినిమాతో 2024 సంవత్సరాన్ని ముగించానని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.అమరన్ నా హృదయాన్ని కదిలించిందని ఆమె వెల్లడించారు.అమరన్ సినిమాలోని ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయని జాన్వీ కపూర్ వెల్లడించారు.
పాన్ ఇండియా మూవీగా విడుదలైన అమరన్ భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించింది.అమరన్ మూవీ ఫలితం నిర్మాతలకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగించింది.శివ కార్తికేయన్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.అమరన్ సినిమా సౌత్ ఇండియా రేంజ్ ను పెంచిన సినిమాలలో ఒకటని చెప్పవచ్చు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.హీరోయిన్ జాన్వీ కపూర్ భాషతో సంబంధం లేకుండా సంచలనాలు సృష్టించి మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.