కింగ్ చార్లెస్ 2025 న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్‌ .. 30 మంది భారతీయ ప్రముఖులకు చోటు

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని యూకే రాజు.కింగ్ చార్లెస్( King Charles ) 2025 న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్‌లో 30 మంది భారత సంతతికి చెందిన ప్రముఖులకు స్థానం దక్కింది.వీరిలో కమ్యూనిటీ లీడర్స్, విద్యావేత్తలు, వైద్య నిపుణులు వున్నారు.2025 ఆనర్స్ లిస్ట్‌లో 1200కు పైగా వ్యక్తులు ఉన్నారు.క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్యాసంస్థలు, స్వచ్చంద సేవలో రోల్ మోడల్‌లుగా నిలిచిన వారికి ప్రత్యేక ప్రశంసలు దక్కాయి.

 30 Indian-origin Professionals To Be Recognised In King Charles 2025 New Year Ho-TeluguStop.com

బ్రిటీష్ చక్రవర్తి పేరుతో కేబినెట్ కార్యాలయం ప్రతి యేటా విడుదల చేసే జాబితాలో సత్వంత్ కౌర్ డియోల్‌కు ‘కమాండర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్’ (సీబీఈ), చార్లెస్ ప్రీతమ్ సింగ్ ధనోవాకు ‘ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ ’( Order of the British Empire ) (ఓబీఈ) దక్కింది.

హెల్త్ కేర్, సైన్స్, ఇన్నోవేషన్ , టెక్నాలజీ రంగాలలో ప్రొఫెసర్ స్నేహ్ ఖేమ్కాను కూడా ఓబీఈకి ఎంపిక చేశారు.రిటైల్ అండ్ కన్జ్యూమర్ సెక్టార్‌కు సేవలందించినందుకు గాను మయాంక్ ప్రకాష్, పూర్ణిమ మూర్తి తణుకు, ఛానెల్ సీఈవో లీనా నాయర్‌లకు సీబీఈ అవార్డ్ వరించింది.

Telugu Indianorigin, Charles, Honours List, British Empire-Telugu Top Posts

సంజయ్ ఆర్య, నందిని దాస్, టార్సెమ్ సింగ్ ధాలివాల్, జాస్మిన్ దోటివాలా, మోనికా కోహ్లీ, సౌమ్య మజుందార్, సీమా మిశ్రా, ఉష్మా మన్హర్ పటేల్, జియాన్ సింగ్ , శ్రావ్య రావు, మన్‌దీప్ కౌర్ సంఘేరా, సవ్‌రాజ్ సింగ్ సిద్ధూ, స్మృతి శ్రీరామ్‌లను ఓబీఈకి ఎంపిక చేశారు.

Telugu Indianorigin, Charles, Honours List, British Empire-Telugu Top Posts

ఇక 2025 సంవత్సరానికి గాను మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (ఎంబీఈ) , మెడలిస్ట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (బీఈఎం)ల జాబితాలో దలీమ్ కుమార్ బసు, మారిమౌటౌ కుమారస్వామి, ప్రొఫెసర్ భాస్కర్ దాస్ గుప్తా, అజయ్ జై కిషోర్ వోరాలు ఎంపికయ్యారు.శ్రీలంక – భారతీయ వారసత్వానికి చెందిన కన్జర్వేటివ్ ఎంపీ రణిల్ మాల్కం జయవర్ధన, ఇటీవల రాజీనామా చేసిన ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు మేనేజర్ గారెత్ సౌత్‌గేట్‌తో కలిసి నైట్‌హుడ్ ఫర్ పొలిటికల్ అండ్ పబ్లిక్ సర్వీస్ గౌరవాన్ని పొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube