1.హైదరాబాద్ కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ రేపు హైదరాబాద్ కు రానున్నారు.నెలరోజుల పాటు మాణిక్యం ఠాగూర్ తెలంగాణలోనే మకాం వేయబోతున్నారు.
2.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత అనుచరుడి అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి ని సీబీఐ అరెస్ట్ చేసింది.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు సన్నిహితుడిగా అభిషేక్ కు గుర్తింపు ఉంది.
3.ములాయం మృతి పై దిగ్భ్రాంతి
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం మృతి పై తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
4.రాజగోపాల్ రెడ్డి ని అనర్హుడుగా ప్రకటించాలి
మునుగోడు ఉపఎన్నిక బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.వేలకోట్ల ప్రాజెక్టు తీసుకుని బిజెపిలో రాజగోపాల్ రెడ్డి చేరారని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు.
5.నేడు రాజగోపాల్ రెడ్డి నామినేషన్
మునుగోడు ఉపఎన్నిక లలో బిజెపి అభ్యర్థిగా నేడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
6.భారత్ జోడో యాత్రకు జనసమీకరణ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర విజయవంతం చేయడానికి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
7.సాగర్ 10 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,22,446 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
8.చిత్తూరులో ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం బంధార్లపల్లి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.గత పది రోజులుగా ఏనుగులు ఈ పరిసరాలలో సంచరిస్తూ పంటలను పాడు చేస్తున్నట్లు స్థానిక రైతులు తెలిపారు.
9.టిడిపి వైసిపి పై జీవీఎల్ కామెంట్స్
వైసిపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ చేసిన అన్యాయంపై మాట్లాడే దమ్ము జగన్, చంద్రబాబుకు లేదని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
10.జగన్ చంద్రబాబు పై వీర్రాజు కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు , సీఎం జగన్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు.టిడిపి వైసిపిలు రెండు పార్టీలు నాగరాజ్, సర్పరాజు … రూలింగ్ పార్టీ కాదు… ట్రెండింగ్ పార్టీ అంటూ విమర్శించారు.
11.సోమశిల ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత
సోమశిల జలాశయానికి వరద పెరుగుతోంది.దీంతో ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.అధికారులు ప్రాజెక్టుకు ఉన్న ఆరు గేట్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
12.సుంకేసుల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
సుంకేసుల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అధికారులు ముందస్తుగా ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
13.శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులోని మూడు గేట్లను 10 అడుగుల నీటిని విడుదల చేశారు.
14.శ్రీవారి హుండీ ఆదాయం
శ్రీవారి హుండీ ఆదాయం సెప్టెంబర్ లో 122.19 కోట్లు లభించినట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు.
15.జాతీయ జంతువుగా ‘ఆవు ‘ పిటిషన్ కొట్టివేత
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
16.అచ్చెన్న నాయుడు కామెంట్స్
డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జగన్ ప్రభుత్వానికి అలవాటేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
17.అమరావతి యాత్ర పై రోజా కామెంట్స్
అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర పై ఏపీ మంత్రి రోజా కామెంట్స్ చేశారు.అది అమరావతి యాత్ర కాదని అత్యాశ యాత్ర అంటూ విమర్శించారు.
18.డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో నేడు, రేపు జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి .ఈనెల 19 , 20 తేదీలు మార్పు చేసినట్లు ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించింది.
19.పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు
విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు మొదలయ్యాయి.నేడు తోలేళ్లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాన్ సాన్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు.
20.ఈనెల 25న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం మూసివేత
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయాన్ని ఈనెల 25 న మూసివేయనున్నారు.