ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది.రష్యా మిస్సైళ్ల మోతతో ఉక్రెయిన్ లో పరిస్థితులు మరింతగా దిగజారాయి.
మళ్లీ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితుల్లో ఉక్రెయిన్ లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీని విడుదల చేసింది.అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు సూచించింది.
కీవ్ లోని భారత రాయబార కార్యాలయంతో సంబంధాలు కొనసాగించాలని తెలిపింది.ప్రస్తుతం తమ పరిస్థితి ఏమిటన్న విషయాన్ని ఎంబసీకి తెలియజేయాలని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
కీవ్ లక్ష్యంగా రష్యా దాడులతో ఒక్కసారిగా అప్రమత్తమైన భారత్… అక్కడి తన పౌరులకు జాగ్రత్తలు చెబుతూ అడ్వైజరీ విడుదల చేసింది.







