చాలా మందిని వేధించే సమస్య పంటి నొప్పిదంతాలు పుచ్చిపోవడం, ఇన్ఫెక్షన్, కొత్తగా దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు రావడం, చిగుళ్ల వ్యాధులు తదితర కారణాల వల్ల పంటి నొప్పి వస్తుంది.ఒక్కసారి పంటి నొప్పి వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు.
దీంతో బాధ భరించలేక చాలా మంది డాక్టర్‌ను ఆశ్రయిస్తుంటారు.కానీ తీరిక లేకపోవడం వల్ల హాస్పిటల్ కు వెళ్లడం కుదరకపోయిన వారు ఈ కింది చిట్కాలు పాటించడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
వేడి నీటిలో ఉప్పు వేసి కరిగాక పుక్కించాలి.ఇలా చేయడం వల్ల సహజమైన యాంటి సెప్టిక్‌లా పని చేస్తుంది.
కనీసం 30 సెకన్లపాటు ఉప్పు నీటిని పుక్కిలించాక ఉమ్మేయడం వల్ల దంతాల చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్తాయి.ఇన్ఫెక్షన్ పెరగకుండా కూడా చూసుకోవచ్చు.
రోజూలో వీలైనన్ని సార్లు ఇలా పుక్కిలించడం వల్ల సూక్ష్మజీవులు నశించి నొప్పి తగ్గుముఖం పడుతుంది.
ఓ వెల్లుల్లి రెమ్మని పేస్ట్ చేసి ఆ పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచితే అనేక లాభాలుంటాయి.
పంటి నొప్పి పరార్ అవుతుంది.తాజా వెల్లుల్లి రెమ్మని నెమ్మదిగా నమిలినా కూడా పంటి నొప్పి వెంటనే మాయమైపోతుంది.
పంటి నొప్పికి లవంగాలు చాలా మేలు చేస్తాయి.లవంగాలు వాడడం అనేది కూడా మనకి ఎన్నో రెట్లు మేలు చేస్తుంది.
లవంగాలతో పంటి నొప్పిని తగ్గించుకోవడానికి ముందుగా ఒక కాటన్ బాల్ మీద కొద్దిగా లవంగ నూనె తీసుకుని దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి.

ఈ లవంగ నూనెని కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్, లేదా నీటితో డైల్యూట్ చేసి వాడితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.ఇలా రోజుకి కొన్ని సార్లు చేయవచ్చు.ఒక చిన్న గ్లాసు నీటిలో కొన్ని చుక్కల లవంగం నూనె వేసి మౌత్ వాష్ లాగా ఉపయోగించినా ఫలితం ఉంటుంది.