ముఖ్యంగా చెప్పాలంటే చలికాలంలో చాలామందికి దగ్గు మరియు జలుబుతో ఇబ్బంది పడుతుంటారు.ఇది ఛాతీలో కఫం పేరుకుపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఊపిరితిత్తులలో( Lungs infection ) దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ నిమోనియా ప్రమాదాన్ని పెంచుతుంది.
కఫం ఉంటే రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు.ఈ సమస్యకు ఇక్కడ ఇచ్చిన ఆయుర్వేద కాషాయాన్ని తీసుకోవాలి.
ఇలా క్రమం తప్పకుండా వారంలో మూడు నుంచి నాలుగు రోజులు చేస్తే ఉపశమనం పొందవచ్చు.ఈ ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సుమారు ఒక అంగుళం అల్లం ముక్క,( Ginger ) అలాగే 8 నుంచి 10 ఎండుమిర్చి, ఇంకా పది తులసి ఆకులు, కొంచెం పసుపు, ఒక దాల్చిన చెక్క( Cinnamon ) ముక్క, ఒక పెద్ద బెల్లం ముక్క, ఒక గ్లాస్ నీరు ఉంటే సరిపోతుంది.కాషాయాన్ని తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ కాషాయాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక కుండలో నీటిని మరిగించాలి.దానికి తులసి ఆకులు, ఎండుమిర్చి, పచ్చి పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.నీటిలో దాల్చిన చెక్క, బెల్లం మరియు అల్లం వేసి బాగా మరిగించాలి.మీరు సగం ఉడకబెట్టి దాని రంగు మారేవరకు సుమారు 20 నిమిషాల పాటు వీటిని మరిగించాలి.
దాదాపు సగం గ్లాసుకు తగ్గిన తర్వాత మగ్గులో వడకట్టి వేడిగా త్రాగాలి.ఈ కషాయాన్ని మూడు నుంచి నాలుగు రోజులు క్రమం తప్పకుండా సేవించాలి.
దీంతో జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే వీటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కాషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని వేడి చేస్తుంది.అలాగే కఫాన్ని ఇది కరిగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులో పచ్చి పసుపు( Turmeric )ను ఉపయోగించడం వల్ల కఫం విడుదలవుతుంది.</br

అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయని నిపుణులు చెబుతున్నారు.దీనివల్ల ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం కూడా కరిగిపోతుంది.అలాగే ఈ కాషాయం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
ఇందులో ఉపయోగించే పదార్థాలను ఎక్కువగా కూడా ఉపయోగించకూడదు.ఇలా ఉపయోగిస్తే గుండెల్లో మంట, వికారం వంటి చికాకు ను కలిగిస్తాయి.
కాబట్టి ఆరోగ్యానికి మంచిదని ఏ ఆహార పదార్థాన్ని కూడా అతిగా తీసుకోకూడదు.