పనీర్( Paneer ).పాల నుంచి తయారయ్యే ఉత్పత్తుల్లో ఇది ఒకటి.
అలాగే మనలో చాలా మందికి పనీర్ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్.పనీర్ తో రకరకాల ఐటమ్స్ తయారు చేస్తుంటారు.
ఏ డిష్ చేసిన దానికి తిరుగే ఉండదు.పిల్లలు కూడా పనీర్ తో తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ ఎంతో ఇష్టంగా తింటున్నారు.
అధిక ప్రోటీన్ కంటెంట్ మరియు ఇతర పోషకాలు కారణంగా ఆరోగ్యానికి పనీర్ ఎంతో మేలు చేస్తుంది.అలా అని చెప్పి పదే పదే పనీర్ తింటే లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి పనీర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది.రోగ నిరోధక శక్తిని( Immunity ) పెంచడానికి, ఎముకల దృఢత్వానికి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి పనీరు మద్దతు ఇస్తుంది.
అయితే ఎన్ని ప్రయోజనాలను అందించినప్పటికీ.లిమిట్ అనేది చాలా ముఖ్యం.లిమిట్ లెస్ గా పనీర్ ను తీసుకుంటే ఆరోగ్య లాభాలను పొందకపోగా డేంజర్ జోన్ లో పడతారు.
పనీర్ లో సంతృప్త కొవ్వు అధికంగా ( High in fat )ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు కూడా పెరుగుతుంది.అలాగే పనీర్ అనేది చాలా సులభంగా జీర్ణం అవుతుంది.
కానీ దాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరం, వికారం, కడుపు నొప్పి, తిమ్మిర్లు( Bloating, nausea, abdominal pain, cramps ) మరియు అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
పనీర్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది.ఇది అధిక రక్తపోటు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.మీరు ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతుంటే పనీర్ ను దూరం పెట్టడమే మంచిది.
పనీర్ లో కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది.ఇది ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
కానీ ఓవర్ గా తీసుకుంటే మాత్రం కిడ్నీ స్టోన్స్ కి దారి తీస్తుంది.ప్రోటీన్ కోసం కొందరు పనీర్ ను పదే పదే తీసుకుంటారు.
దీని వల్ల మీ ఆహారంలో ఇతర పోషకాల అసమతుల్యతకు దారి తీస్తుంది.ఇక పనీర్ వంటి పాల ఉత్పత్తులు అతిగా తీసుకోవడం వల్ల కొందరిని మొటిమలు హెవీగా ఇబ్బంది పెడతాయి.