అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ యోగా గురు శరత్ జోయిస్(yoga guru Sharath Jois ) హఠాన్మరణం చెందారు.ఆయన వయసు 53 సంవత్సరాలు.
శరత్(Sharath) స్వస్థలం కర్ణాటకలోని మైసూరు.అష్టాంగ యోగాను అమెరికాలో విస్తరించడంలో శరత్ కీలక పాత్ర పోషించారు.
శరత్ యోగా సెంటర్ ప్రకారం .కొత్త బ్యాచ్ క్లాస్‌లను స్టార్ట్ చేయడానికి డిసెంబర్‌లో తన స్వగ్రామానికి రావాలని అనుకుంటుండగా శరత్ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో ఆయన శిష్యులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
వర్జీనియా యూనివర్సిటీలోని కాంటెంప్లేటివ్ సైన్సెస్ సెంటర్‌లో శరత్ బోధిస్తున్నారు.నవంబర్ 16 నుంచి 20 వరకు టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు రావాల్సి ఉంది.వచ్చే ఏడాది సిడ్నీ, దుబాయ్‌లలోనూ జోయిస్ ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌లలోనూ శరత్ పాల్గొనాల్సి ఉంది.ఆయన మరణానికి దారి తీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.శరత్ జోయిస్‌కు(Sharath Jois) తల్లి సరస్వతి జోయిస్, తండ్రి రంగస్వామి, భార్య శృతి జోయిస్ , కుమారుడు సంభవ్ జోయిస్, కుమార్తె శ్రద్ధా జోయిస్ ఉన్నారు.yoga guru Sharath Jois
సమకాలీన ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన యోగా గురువులలో ఒకరిగా శరత్ పేరు సంపాదించారు.తన తాత, దివంగత యోగా ఐకాన్ కే పట్టాభి జోయిస్(Pattabhi Jois) నుంచి ఆయన ఈ కళను నేర్చుకున్నారు.అష్టాంగ యోగాకు ప్రజల్లో ఆదరణ కల్పించడంలో శరత్ ఎంతో కృషి చేశారు.2009లో పట్టాభి మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని శరత్ కొనసాగించారు.మడోన్నా, సినీ నటి గ్వినేత్ పాల్ట్రోతో (Gwyneth Paltrow)సహా ఎంతో మంది సెలబ్రిటీలకు శరత్ యోగాను బోధించారు.2016 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతుల్లో ఓడిపోయిన తర్వాత హిల్లరీ క్లింటన్ మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారు.ఆ సమయంలో నాసికా శ్వాస, నాడి శోధన ప్రాణాయామం అనే టెక్నిక్ తనకు ఎంతో ఉపయోగపడిందని హిల్లరీ క్లింటన్ తెలిపారు.