లండన్‌లో రంజాన్ నెల సందడి మొదలైందో లేదో, కింగ్ చార్లెస్ III, క్వీన్ కామిల్లా( King Charles III, Queen Camilla ) దంపతులు ఒక్కసారిగా దర్శనమిచ్చారు.అస్మా ఖాన్ అనే బ్రిటీష్-ఇండియన్ చెఫ్ నడుపుతున్న ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్’( Darjeeling Express ) అనే ఇండియన్ రెస్టారెంట్‌లో వారు ప్రత్యక్షమయ్యారు.
అక్కడ రాయల్ కపుల్ ఊరికే విజిట్ చేయలేదు.మంచి పని కూడా చేశారు.
రంజాన్ సందర్భంగా పేదలకు పంచే ఖర్జూరాలను ప్యాక్ చేయడంలో వాళ్లతో కలిసిపోయారు.ఆ తర్వాత కింగ్ చార్లెస్ స్వయంగా తన కోసం చికెన్ బిర్యానీ టేక్‌అవే ఆర్డర్ చేసుకున్నారు.
అస్మా ఖాన్ ఈ విజిట్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మురిసిపోయింది.రాజు, రాణి రెస్టారెంట్ స్టాఫ్‌తో కబుర్లు చెబుతూ, పనులు చేస్తూ కనిపించారు ఆ వీడియోలో.“ఈ రోజు రాజు, రాణి మా డార్జిలింగ్ లండన్‌కి ప్రీ-రంజాన్ మీట్‌కి వచ్చారు.ఖర్జూరాలు, బిర్యానీ ప్యాక్ చేశారు.అంతేకాదు బిర్యానీ ఇంటికి కూడా తీసుకువెళ్లారు.‘డెలివర్-వూ?’ అని క్యాప్షన్ కూడా పెట్టింది అస్మా ఖాన్.

అస్మా ఖాన్ ఒక ఫేమస్ బ్రిటీష్-ఇండియన్ చెఫ్, రెస్టారెంట్ ఓనర్, రచయిత కూడా.2024లో టైమ్ మ్యాగజైన్ ( Time magazine )ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల లిస్టులో ఈమె పేరును చేర్చింది అంటే మామూలు విషయం కాదు.అస్మా ఖాన్ రెస్టారెంట్ ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్’ లో పనిచేసే చెఫ్స్ అందరూ ఆడవాళ్లే.అందులో చాలామందికి వంటల్లో ఎలాంటి ఫార్మల్ ట్రైనింగ్ కూడా లేదు.కానీ వాళ్ల చేతి వంటకి మాత్రం ఫిదా అవ్వాల్సిందే.అస్మా ఖాన్ ( Asma Khan )కోల్‌కతాలో పుట్టింది.
రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.వాళ్ల అమ్మ బెంగాలీ అరిస్టోక్రసీ ఫ్యామిలీకి చెందినవారు, నాన్న రాజపుత్ రాయల్ ఫ్యామిలీకి చెందినవారు.1996లో లా చదవడానికి లండన్ వెళ్లింది.కింగ్స్ కాలేజీలో లా డిగ్రీ చేసింది.
ఆ తర్వాత 2013లో పీహెచ్‌డీ కూడా పూర్తి చేసింది.కానీ ఆమె మనసంతా వంట మీదే లగ్నమై ఉండేది.

2012లో అస్మా ఖాన్ ఫుడ్ ఇండస్ట్రీలోకి ఒక హోమ్ సప్పర్ క్లబ్‌తో ఎంట్రీ ఇచ్చింది.వచ్చిన డబ్బులన్నీ చారిటీకి డొనేట్ చేసేది.ఆమె దగ్గర పనిచేసే చెఫ్స్‌లో చాలామంది సౌత్ ఏషియన్ నానీలు (పిల్లల్ని చూసుకునే ఆయాలు).వాళ్లంతా ఆదివారం అస్మా ఇంటికి వచ్చి టీ, సమోసాలు తింటూ సీరియల్స్ చూసేవారు.
ఫుడ్ మీద ఉన్న ప్రేమతో డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్ స్టార్ట్ చేసి, ఆ ఆడవాళ్లకి వాళ్ల టాలెంట్ చూపించే ఛాన్స్ ఇచ్చింది అస్మా ఖాన్.అస్మా ఖాన్ రెస్టారెంట్‌తోనే ఆగలేదు.
రెండు కుక్‌బుక్స్ కూడా రాసింది.అవే అస్మాస్ ఇండియన్ కిచెన్ (2018), అమ్ము (2022).
ఇందులో ఒకటి ఫ్యామిలీ రెసిపీస్ కలెక్షన్, మరొకటి వాళ్ల అమ్మ వంటకాలకు ట్రిబ్యూట్.ఈ బుక్ 2022లో ‘ది టైమ్స్ కుక్‌బుక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా కొట్టేసింది.2019లో నెట్‌ఫ్లిక్స్‌లో ‘చెఫ్స్ టేబుల్’ అనే షోలో కనిపించిన ఫస్ట్ బ్రిటీష్ చెఫ్ కూడా అస్మా ఖానే.







