మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

సాధారణంగా పెరుగు( Curd ) అనేది ప్రతి ఒక్కరు కూడా భోజనంలో ఎంతగానో ఇష్టపడి తింటూ ఉంటారు.ఒక రకంగా చెప్పాలంటే పెరుగు అన్నం లేకుండా భోజనం అస్సలు పూర్తికాదు.

 Quick Home Remedies For Knee Pain Curd Benefits Details, Home Remedies ,knee Pai-TeluguStop.com

పెరుగులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్ లాంటివి సమృద్ధిగా లభిస్తాయి.పెరుగులో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

అయితే పెరుగులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కీళ్లనొప్పులు( Knee Pains ) ఉన్నవారు మాత్రం తినడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ మధ్యకాలంలో చాలామంది కీళ్ల నొప్పులు, మెడ నొప్పులు, వెన్ను నొప్పులతో ఎంతగానో బాధపడుతున్నారు .అయితే ఒకప్పుడు ఇలాంటి నొప్పులు కేవలం వయసు అయిన వాళ్లకు మాత్రమే ఉండేవి.కానీ ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ నొప్పులు వస్తున్నాయి.

కాబట్టి దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే నొప్పులు ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వలన నొప్పులు మరింత ఎక్కువగా అవుతాయి.

Telugu Pain, Butter Milk, Curd, Curd Benefits, Tips, Knee Pain, Neck Pain-Telugu

అలాగే ఫ్రిజ్లో పెట్టిన పెరుగు, పుల్లగా ఉన్న పెరుగు తినడం వలన కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.అయితే పెరుగు తినాలని అనుకున్న వారు పెరుగుకు బదులుగా మజ్జిగ( Butter Milk ) తీసుకోవచ్చు.మజ్జిగ వలన అంతగా నొప్పులు పెరగవు.అయితే మజ్జిగలో కూడా బెల్లం( Jaggery ) కలుపుకుని తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

అంతేకాకుండా అలసట లాంటివి కూడా తొలగిపోతాయి.

Telugu Pain, Butter Milk, Curd, Curd Benefits, Tips, Knee Pain, Neck Pain-Telugu

ఇక అధిక బరువు( Over Weight ) సమస్యతో బాధపడేవారు కూడా పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం మంచిది.ఎందుకంటే పెరుగులో కొవ్వు ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలని అనుకున్న వారు పెరుగు తీసుకోకూడదు.కాబట్టి మజ్జిగ తీసుకుంటే అందులో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్న వారు మజ్జిగ తీసుకొని ప్రయత్నించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube