వ్యసనం ఏ రూపంలో ఉన్నా నరకాన్నే చూపిస్తుంది.శరీరాన్ని, జీవితాన్ని నాశనం చేస్తుంది.
ఇంకా దారుణం ఏంటంటే, మనల్ని ప్రేమించేవాళ్లకు కూడా కన్నీళ్లే మిగులుస్తాయి.వ్యసనం లేదా మత్తులోంచి బయటపడటం అంటే మామూలు విషయం కాదు.
ఇక్కడ మనం చెప్పుకోబోయే 38 ఏళ్ల మహిళ కూడా కోకైన్ మత్తులో ( Cocaine intoxication )కూరుకుపోయింది.అంతే కాదు, ఆ మత్తులో ముక్కునే పోగొట్టుకుంది.
ఇప్పుడు ఆమె ముఖం చూస్తే షాక్ అవ్వడం మీ వంతవుతుంది.
డైలీ స్టార్ న్యూస్ చెప్పిన ప్రకారం, ఈమె పేరు కెల్లీ కోజైరా( Kelly Kozaira ).అమెరికాలోని చికాగోలో ఉంటుంది.2017లో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లింది.ఆ రోజు రాత్రి తన జీవితాన్నే మార్చేసింది.పార్టీలో ఒక ఫ్రెండ్ కోకైన్ ఆఫర్ చేశాడు.‘జస్ట్ ఒకసారి ట్రై చెయ్ ఏం కాదు’ అని చెప్పాడు.ఆ ఒక్కసారి ఆమె జీవితాన్ని మార్చేసింది.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక, ఆ మత్తు పదార్థాన్ని వాసన చూసింది.కొన్ని నెలలు తిరిగేసరికి కోకైన్ లేకుండా ఉండలేని పరిస్థితి.
రోజులో ఎప్పుడు చూసినా అదే మత్తు.తినడం మానేసింది, నిద్ర పోవడం మరిచింది.
గుడ్డిగా దానికి బానిసైపోయింది.కేవలం 19 నెలల్లో ఏకంగా 70 లక్షలు తగలేసింది.
అంటే రోజుకి లక్షలు ఖర్చు చేసేంతగా మారిపోయింది.

కొంతకాలం గడిచేసరికి కెల్లీ ముక్కులోంచి తరచూ రక్తం కారడం మొదలైంది.ఆ తర్వాత ముక్కుకు రంధ్రం పడింది.అది చూసి కూడా ఆమె లైట్ తీసుకుంది.
ఏముందిలే తగ్గిపోతుందిలే అనుకుంది.కానీ జరిగింది వేరు.
రోజురోజుకీ పరిస్థితి దారుణంగా తయారైంది.ముక్కులోంచి రక్తం, మాంసం ముక్కలు ఊడి రావడం మొదలయ్యాయి.
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ముక్కు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.
ముఖంపై రంధ్రం ఏర్పడింది.అది చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.

ఇంకా లాభం లేదని కుటుంబ సభ్యులు సీరియస్‌గా రంగంలోకి దిగారు.కెల్లీకి కౌన్సిలింగ్ ఇచ్చి మత్తు నుంచి బయటపడేలా చేశారు.2021లో కోకైన్‌కి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ముక్కును మళ్లీ సరి చేయడానికి ఏకంగా 15 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది.డాక్టర్లు ఆమె నుదుటి నుంచి చర్మం తీసుకుని ముక్కు చివర్లో పెట్టారు.
చేతి నుంచి ఆర్టరీ తీసి ముఖానికి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేలా చేశారు.నెమ్మదిగా ముక్కు కోలుకోవడం మొదలైంది.
ఇప్పుడు కెల్లీ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అందరికీ చెబుతోంది.తన కథను అందరికీ చెప్పి కోకైన్ ఎంత డేంజరో వివరిస్తోంది.
డ్రగ్స్‌కి బానిస అయితే జీవితం నాశనం అవుతుందని తన అనుభవంతో హెచ్చరిస్తోంది.







