మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) ఒక మంచి నటుడు మాత్రమే కాదు.ఒక పెద్ద విద్యావేత్త కూడా.
ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు “శ్రీ విద్యానికేతన్”( Shri Vidyanikethan ) అనే పేరుతో స్కూల్స్ మరియు కాలేజెస్ నడుపుతున్నారు.ఐతే మోహన్ బాబు గారు ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం తో న్యూస్ లో ఉంటూనే ఉంటారు.
తాజాగా ఆయన మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారారు.అయన ఒక ఇంటర్వ్యూలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అసలు ఆయన ఏమన్నారో ఇప్పుడు చూదాం.

జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్ర విద్య వ్యవస్థలో తెచ్చిన మార్పులు మనందరికీ తెలిసినవే.రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా మార్చిన కొన్ని కార్పొరేట్ వ్యవస్థలపైనా ఆయన పోరాటం నిరంతరం సాగుతూనే ఉంది.మోహన్ బాబు గారు కూడా ఒక ప్రముఖ విద్యాసంస్థకు యజమాని.
కనుక జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మోహన్ బాబు సంస్థలను కూడా ప్రభావితం చేసాయి.ఈ మార్పుల వలన ఆయన చాలా నష్టపోయారని సమాచారం.
ఈ విషయం పై ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మోహన్ బాబు గారు “జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులవలన నేను నష్టపోయింది నిజమే కానీ ఆయన పై నాకు ఎటువంటి కోపము లేదు.అది ఆయన కర్తవ్యంలో భాగం.” అని అన్నారు.

ఐతే అదే ఇంటర్వ్యూలో ఆయన “జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఆయన పక్కనే ఉంటూ తప్పుడు మార్గదర్శకం చేస్తున్న కొందరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లే” అని అన్నారు.ఆయన ఒకసారి సీఎంని కలవడానికి వెళ్లానని, కానీ ఎటువంటి ప్రయోజనము లేదని అన్నారు.ఆ ఐఏఎస్ లు ఎవరు అని ప్రశ్నించగా, మోహన్ బాబు గారు “వారు ఎవరో నాకు తెలుసు కానీ వారి పేర్లు ఇప్పుడు బయట పెట్టను.
సమయం వచ్చినపుడు ఖచ్చితంగా చెప్తాను” అని అన్నారు.







