తీసిన 24 సినిమాలతో 19 అవార్డులు ఎంత మంది దర్శకులకు సాధ్యం అవుతుంది.కానీ అతడికి సాధ్యం.
నేను ఒక హోమో సెక్సువల్ అని ఎవరైనా ప్రకటించుంటారా ? కానీ ఆ వ్యక్తి బోలా శంకరుడు అందుకే అన్ని మీడియాతో, అభిమానులతో పంచుకుంటాడు.ఎంత మంది సినీ దర్శకులు చనిపోతే ప్రభుత్వ అధికారిక లాంఛనాలు దొరుకుతాయి.
కానీ అతడికి ఆ గౌరవం తగ్గింది.హీరో, హీరోయిన్స్ చనిపోతే లక్షల్లో జనాలు తరలి రావడం అత్యంత సహజం.
కానీ ఒక దర్శకుడు చనిపోతే అభిమానులు అదే విధంగా అభిమానులు తరలి రావడం ఎవరికి సాధ్యం.కానీ ఆ దర్శకుడికి సాధ్యం అయ్యింది.
మరి ఇంత సేపు చెప్తున్నా ఆ దర్శకుడు ఎవరు అని కదా మీ సందేహం ? అతడు మరెవరో కాదు.కేవలం 24 సినిమాలు మాత్రమే తీసి అతి పిన్న వయసులో గుండె పోటుతో మరణించిన రితూపర్ణోఘోష్. బాలీవుడ్ లో వివాదాలకు కేంద్ర బిందువు రితూపర్ణోఘోష్.తాను తీసిన సినిమాలు కూడా అంతే వివాదాలకు అడ్డ్రస్ అన్నట్టుగా ఉంటాయి.మరో వైపు అవార్డులు, పురస్కారాలు కూడా దక్కుతాయి.అంత టాలెంట్ ఉన్న దర్శకుడు రితూపర్ణోఘోష్.
ఇక కేవలం సినిమాలు తీయడమే కాదు తనను తాను ట్రాన్స్ జెండర్ గా, హోమో సెక్సువల్ గా ప్రకటించుకొని చిత్రాంగద సినిమాలో ఒక ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించాడు.
అంతే కాదు తన సినిమాతో LGBT వర్గానికి తన సినిమాల ద్వారా మద్దతు తెలిపిన ఏకైక దర్శకుడు రితూపర్ణోఘోష్.కేవలం 49 కన్ను మూస్తే వేలల్లో అభిమానులు త్వరలో వచ్చారు.బెంగాలీ కళాకారులకు మంచి మర్యాద దక్కుతుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
ఇక ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సైతం సోషల్ మీడియా వేదికగా అతడి పాటను పంచుకున్నారు.బెంగాలీ సాంప్రదాయ వాదులు ఎన్నో అవమానాలు చేసిన ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ వంటి వారి చేత మంచి పాత్రలు వేయించాడు రితూపర్ణోఘోష్.
అయన ఈ రోజు మరణించి ఉండకపోతే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీసి ఉండేవారు అంటూ ఉంటారు అయన అభిమానులు.అయన తీసిన ఉనిషె ఏప్రిల్ లాంటి చిత్రం అమెజాన్ లో దర్శనం ఇస్తుంది.
ఈ చిత్రం సైతం మంచి సినిమాగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.ఎన్ని అపార్దాల నడుమ, కుటుంబం లో ఉండే దూరం వంటి అంశాలను జోడించి మంచి సినిమా గా మలిచారుల.