మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్, గిరిజన బంధు పధకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.
నేటి వరకు గిరిజనులకు ఏ ప్రభుత్వం అందించని అనేక పధకాలను కేసీఆర్ అమలు చేస్తూ గిరిజనులకు ఆరాధ్యుడగా మారాడని, తనకు తల్లిదండ్రులు జన్మణిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పునర్జన్మను ఇచ్చాడని కొనియాడారు.
తన రాజకేయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురు కున్నానని అన్నింటినీ అధిగమించి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానని నా జీవితం ఉన్నంత కాలం ముఖ్యమంత్రి కెసిఆర్ కు రుణపడి ఉంటానని అన్నారు.
తన జీవుతాన్ని గుర్తుచేసుకుంటు భావోద్వేగానికి లోనై కన్నిటిపర్యంతమయ్యారు.గిరిజన ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.