1.కవితపై కోదండరాం మండిపాటు
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ వ్యాపారంతో పనేంటని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు.
2.ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రి లో చేరారు.రొటీన్ చెకప్ ల కోసం ఆసుపత్రిలో చేరినట్లు హాస్పటల్ వర్గాలు తెలిపాయి.
3.ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
హైదరాబాద్ నగరంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఏకకాలంలో 40 చోట్ల ఐటి సోదాలు కొనసాగుతున్నాయి.
4.సోము వీర్రాజు తీరుపై కన్నా ఆగ్రహం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు పై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు.బిజెపి జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పు పట్టారు.కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని మండిపడ్డారు.
4.రేవంత్ రెడ్డి సెటైర్లు
ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.నిరంకుశ పరిస్థితుల నుంచి విముక్తి కల్పించేది కాంగ్రెస్ మాత్రమేనని, బండ్లతోని గుండ్లతోని అయ్యేది ఏం లేదని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
5.అల్లూరు జిల్లాలో పులి సంచారం
అల్లూరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది.అనంతగిరి మండలం, రొంపల్లి ఎం ఎస్ ఆర్ పురం లో మూడు ఆవులను పులి చంపింది
6.జగన్ ప్రభుత్వం పై చింతా మోహన్ కామెంట్స్
జగన్ ప్రభుత్వం పై టిడిపి నేత చింత మోహన్ మండిపడ్డారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తే పేదల పరిస్థితి అర్థం అవుతుందని, ఉచితంగా ఇస్తామంటే రాని పేదలు ఉండరని అన్నారు.
7.హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సదస్సు ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ సదస్సు ప్రారంభమైంది.
8.జవహర్ నవోదయ లో ఆరో తరగతి ప్రవేశాలు
నవోదయ విద్యాలయ సమితి దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
9.అయ్యప్ప దీక్ష దారులు భారీ ర్యాలీ
విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో అయ్యప్ప దీక్ష దారులు భారీ ర్యాలీ నిర్వహించారు.దేవుళ్లను దూషించడం ఒక ఫ్యాషన్ గా మారిందని అయ్యప్ప స్వాములు మండిపడ్డారు.
10.సికింద్రాబాద్ రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ రామనాథపురం మధ్య సంక్రాంతి రద్దీ దృశ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
11.కుష్బూ కామెంట్స్
తమిళనాడు లో అధికారంలో ఉన్న డీఎంకే లోని కొందరు నాయకులు మహిళలను గౌరవించడం లేదని సీనియర్ నటి కుష్బూ విమర్శించారు.
12.సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా చెన్నై వ్యాప్తంగా 16,932 ప్రత్యేక బస్సులను నడపాలని తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది.
13.టిడిపి నేతలకు ముందస్తు బెయిల్
మాచర్ల గతంలో టిడిపి నాయకులకు టిడిపి ఇన్చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి తో సహా 23 మందికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
14.అధిష్టానంతో మాట్లాడి స్పందిస్తా : ఎమ్మెల్యే ఆనం
వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు మరొకరికి అప్పగించారని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అయితే దీనిపై అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని మాజీమంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
15.ఎన్జీటీ తీర్పు పై సుప్రీంకోర్టుకు
పాలమూరు రంగారెడ్డి ఢిల్లీ ఎత్తిపోతల పథకాలపై జాతీయ హరిత ట్రైబల్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు రాష్ట్ర నీటి పదార్థాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు.
16.మునుగోడు లబ్ధిదారులకు గొర్రెలు
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని గొల్ల కురుమలకు ఈనెల 15వ తేదీలోగా గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసి ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
17.పవన్ వారాహికి కొండగుట్టలో ప్రత్యేక పూజలు
జనసేన ప్రచార వాహనం వారాహికి కొండగుట్టలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
18.ఢిల్లీలో ఎయిర్ ఇండియ విమానం ఎమర్జెన్సీ ల్యడింగ్
ఢిల్లీ నుంచి ఫారెస్ట్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
19.కొనసాగుతున్న మెట్రో ఉద్యోగుల నిరసన
హైదరాబాద్ మెట్రో టికెటింగ్ ఉద్యోగుల నిరసన రెండో రోజు కొనసాగుతోంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,750
.