వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల నిరసన గళం పెంచారు.సొంత పార్టీ నేతలపైనే విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్నారు.
ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో.సీఎం జగన్ ఆగ్రహానికి గురయ్యారు.
దాంతో.ఆయనను పొమ్మనలేక పొగ పెట్టేందుకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించి.
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు.నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి ఎప్పటి నుంచో ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు.సీఎం జగన్ మాత్రం మేకపాటి వారికి ఆ సీట్ పై పట్టు ఉండటంతో.
వారికే వదిలేశారు.అది ఆది నుంచి ఆనంకి నచ్చడం లేదు.
దాంతో ఆయన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.ఇక వచ్చే ఎన్నికల్లో ఆనం ను పక్కన పెట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వీటిని ముందే ఊహించిన మాజీ మంత్రి.తన కూతురు, ఆల్లుడును టీడీపీలో చేర్పించారు.
ఏకంగా నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నారు.దాంతో ఆయనకు ఆత్మకూరు నియోజకవర్గాన్ని సైతం రిజర్వ్ చేసి ఉంచారు.అయితే ఎమ్మెల్యే పదవిలో ఉండగా పార్టీ మారితే వేటు తప్పదని ముందేఊహించిన ఆనం.ఫ్లోర్ క్రాసింగ్ కు ససేమీరా అన్నారు.దాంతో చంద్రబాబు సైతం సైలెంట్ అయిపోయారు.ఇక సమయం దగ్గర పడుతుండటంతో.ఆనం జంప్ అవడానికి సన్నద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.సీఎం జగన్ సైతం ఆ విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు.
ఆనం వెళ్లిపోయినా.అక్కడ కేడర్ కు నష్టం కలగకుండా ఉండేందుకు.
నేదురుమల్లికి బాధ్యతలు అప్పగించారు.అంతా అనుకున్నట్టు ఆయన టీడీపీ తీర్థం తీసుకుంటే.
అది ఆయన రాజకీయ భవిష్యత్తుపైనే ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని.విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.