ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. అరటిపండ్లకు దూరంగా ఉండడమే మంచిది..!

అరటి పండ్లు(Banana) మన ఆరోగ్యానికి చాలా మంచివని చాలా మంది ప్రజలకు తెలుసు.అరటి పండ్లలోని పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

 People With These Health Problems Should Stay Away From Bananas Details, Banana,-TeluguStop.com

అరటి పండు లో ఉండే ఫైబర్, విటమిన్లు,ఖనిజాలు, చక్కెర, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం.దీనిలో ఉండే పోషకాలు కారణంగానే దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.

అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అరటి పండ్లను తినకూడదని అలా తింటే ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అరటి పండ్లను ఎలర్జీ సమస్యలు(Allergy) ఉండేవాళ్ళు పొరపాటున కూడా అరటిపండు తినకూడదు.ఇలాంటి వారు అరటి పండ్లను తినడం వల్ల స్వెల్లింగ్, శ్వాస ఇబ్బంది ఎనాఫిలెక్సిస్ వంటి తీవ్ర లక్షణాలు బయటపడుతున్నాయి.ఇంకా ఏ లక్షణాలతో బాధపడే వారు అరటి పండ్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే అరటి పండ్ల లో నేచురల్ షుగర్ ఉన్న కారణంగా మధుమేహం లేదా బ్లడ్ షుగర్(Diabetes) సమస్యతో బాధపడుతున్న వారు పొరపాటున కూడా వీటిని తినకూడదు.ఒక వేళ తినాల్సి వస్తే బాగా పండిన వాటిని తినకూడదు.

అరటి పండ్ల లో పొటాషియం అధిక మోతాదు లో ఉంటుంది.కిడ్నీ సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇది హానికరం.శరీరంలో అదనంగా ఉన్న పొటాషియం బయటకు తొలగించడంలో సమస్య వస్తుంది.అందుకే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు అరటి పండ్లను అసలు తినకూడదు.ఇంకా చెప్పాలంటే కడుపు, ఉబ్బరం లేదా మలబద్ధకం సమస్యతో బాధపడే వారు అరటి పండ్లను తినకపోవడమే మంచిది.ఎందుకంటే అరటి పండ్లు మలబద్ధకం సమస్యను పెంచుతాయి.

ఆస్తమా రోగులు కూడా అరటి పండ్లు తినకూడదు.తింటే మాత్రం ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube