మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనేక దేశాలలో ఉన్నారు.దేవుళ్లను హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు.
హిందు మతంలోనీ ప్రజలు ఒక్కొక్క దేవుణ్ణి దేవతలను పూజించేటప్పుడు కొన్ని నిర్దిష్ట నియమాలను పాటిస్తూ ఉంటారు.భగవంతుని కృపా, ఆశీర్వాదాలు పొందడానికి హిందూమత ప్రజలు భగవంతుని చాలా భక్తితో పూజిస్తూ ఉంటారు.
భగవంతుని పూజించినప్పుడు ఆయన కృప ఆశీర్వాదం లభిస్తే జీవితంలో ఏదో ఒక గొప్ప విజయం సాధించా వచ్చునే విశ్వాసం హిందూ ప్రజలలో ఉంటుంది.అందువల్ల భగవంతునికి పూజలు చేస్తున్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు.
ఈ తప్పులు చేస్తే కొన్ని సంవత్సరాలుగా పూజలు చేసిన వాటి ఫలితాలు అస్సలు లభించవని వేద పండితులు చెబుతున్నారు.
హిందూ మత గ్రంధాల ప్రకారం ఏ దేవుడినైనా పూజించేటప్పుడు దీపం, నీటి కుండలను పక్కపక్కనే ఉంచరాదు.
దేవతలకు దీపం ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో పెట్టాలి.పూజకు ఉపయోగించే నీటీ పాత్రను ఈశాన్యం లో ఉంచాలి.
దేవుని పూజ కోసం వాడిపోయిన పువ్వులను ఉపయోగించకూడదు.

అలాగే పూజలో నిషేధించబడిన పూలను అస్సలు వాడకూడదు.హిందూమతంలో ఏ దేవత పూజ కోసమైనా ఆసనాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.శ్రమ లేకుండా నేలపై కూర్చొని పూజ చేస్తే ఫలితాలు తక్కువ అని వేద పండితుల విశ్వాసం.
అలాగే భగవంతుని ఆరాధించేటప్పుడు చిన్న పాటి గర్వం కూడా చూపించకూడదు.ఇలా గర్వం ప్రదర్శిస్తే పూజ ఫలితం ఉండదు.
దేవున్ని ఎప్పుడు ఏకాంతంగా, స్వచ్ఛమైన మనసు తో పూజించాలి.భగవంతుని పూజించేటప్పుడు మనసు ఏ చెడు విషయాల పై వెళ్లకూడదు.
ఎవరిపై కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు.ఇలాంటి తప్పుడు పనులేవీ చేయకుండా భగవంతుని ఆరాధిస్తే ఖచ్చితంగా వారి కలలు నెరవేరుతాయి.

DEVOTIONAL