ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.12
సూర్యాస్తమయం: సాయంత్రం.5.51
రాహుకాలం: ఉ.9.00 ఉ10.30
అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
మేషం:

ఈరోజు మీరు అధికంగా లాభాలు అందుకుంటారు.జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి మీ చేతికి అందుతుంది.
వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలు తలదూర్చకండి.మొహమాటాన్ని దరి చేర్చకండి.మిత్రుల సలహాలతో కొన్ని పనులను ప్రారంభిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
మిథునం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.మీ దూరపు బంధువుల నుండి ఆహ్వానం అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.
కర్కాటకం:

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
సింహం:

ఈరోజు మీరు మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.
ఇంటికి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:

ఈరోజు మీరు గతంలో నిలిపివేయబడ్డ పనులు ఈరోజు పూర్తి చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాతనలకు దిగే అవకాశం ఉంది.ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఇతరులకు ఆర్థిక సహాయం చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనుస్సు:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల మనశ్శాంతి గా ఉంటుంది.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మకరం:

ఈరోజు మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.
కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేయకూడదు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉండదు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీనం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.