2500 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా అయోధ్య రామాలయం.. ఈ ఆలయం ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే!

ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఆలయాన్ని 2500 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్మించారని సమాచారం అందుతోంది.

 Ayodhya Ram Mandir Specialities Details, Ayodhya Ram Mandir, Ayodhya, Ram Temple-TeluguStop.com

ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో దేవాలయం కావడం గమనార్హం.ఐరన్ వాడకుండా ప్రత్యేకమైన శిలలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది.

భారతదేశ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో అయోధ్య రామమందిరం ఒకటి కాగా నిర్మాణ, సుందరీకరణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.1989 సంవత్సరంలోనే ప్రస్తుత రామ మందిరం డిజైన్ ను( Ram Mandir Design ) రూపొందించడం జరిగింది. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రధాన ఆలయాన్ని నిర్మించగా ఉపాలయాలు, ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ లిమిటెడ్ నిర్మించడం గమనార్హం.

Telugu Ayodhya, Ayodhya Temple, Ram Lalla, Ram Lalla Idol, Ram Mandir, Ram Templ

ఈ ఆలయ ప్రాంగణంలో 27 మొక్కలను 27 నక్షత్రాలకు సూచికగా గతంలోనే నాటడం జరిగింది.ఈ ఆలయ నిర్మాణం కోసం 115 దేశాల్లోని నీళ్లను 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని వినియోగించారు.అయోధ్యలో( Ayodhya ) ఒక చిన్న టైలర్ దుకాణంను నడుపుతున్న సోదరులు రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు.శ్రీరామనవమి( Srirama Navami ) రోజున బాల రాముడి విగ్రహంపై సూర్యుడి కిరణాలు పడేలా నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది.

Telugu Ayodhya, Ayodhya Temple, Ram Lalla, Ram Lalla Idol, Ram Mandir, Ram Templ

గర్భగుడిలో ప్రతిష్టిస్తున్న బాల రాముడి( Ram Lalla ) ఎత్తు 51 అంగుళాలు కావడం గమనార్హం.యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ఈ ఆలయం కోసం ప్రత్యేక శిలలను తెప్పించారని తెలుస్తోంది.గత 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఈ ఆలయం కోసం వాడుతున్నారు.సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులకు ఈ ఆలయానికి తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ దక్కింది.

అయోధ్య రామాలయం ప్రత్యేకతల గురించి తెలిసి నెటిజన్లు సైతం వావ్ అని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube