2500 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా అయోధ్య రామాలయం.. ఈ ఆలయం ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే!
TeluguStop.com
ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఆలయాన్ని 2500 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్మించారని సమాచారం అందుతోంది.
ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో దేవాలయం కావడం గమనార్హం.ఐరన్ వాడకుండా ప్రత్యేకమైన శిలలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది.
భారతదేశ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో అయోధ్య రామమందిరం ఒకటి కాగా నిర్మాణ, సుందరీకరణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
1989 సంవత్సరంలోనే ప్రస్తుత రామ మందిరం డిజైన్ ను( Ram Mandir Design ) రూపొందించడం జరిగింది.
ఎల్ అండ్ టీ కంపెనీ ప్రధాన ఆలయాన్ని నిర్మించగా ఉపాలయాలు, ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ లిమిటెడ్ నిర్మించడం గమనార్హం.
"""/" /
ఈ ఆలయ ప్రాంగణంలో 27 మొక్కలను 27 నక్షత్రాలకు సూచికగా గతంలోనే నాటడం జరిగింది.
ఈ ఆలయ నిర్మాణం కోసం 115 దేశాల్లోని నీళ్లను 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని వినియోగించారు.
అయోధ్యలో( Ayodhya ) ఒక చిన్న టైలర్ దుకాణంను నడుపుతున్న సోదరులు రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు.
శ్రీరామనవమి( Srirama Navami ) రోజున బాల రాముడి విగ్రహంపై సూర్యుడి కిరణాలు పడేలా నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది.
"""/" /
గర్భగుడిలో ప్రతిష్టిస్తున్న బాల రాముడి( Ram Lalla ) ఎత్తు 51 అంగుళాలు కావడం గమనార్హం.
యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ఈ ఆలయం కోసం ప్రత్యేక శిలలను తెప్పించారని తెలుస్తోంది.
గత 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఈ ఆలయం కోసం వాడుతున్నారు.
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులకు ఈ ఆలయానికి తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ దక్కింది.
అయోధ్య రామాలయం ప్రత్యేకతల గురించి తెలిసి నెటిజన్లు సైతం వావ్ అని కామెంట్లు చేస్తున్నారు.
వావ్, ఈ చిన్నారి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో.. వీడియో చూస్తే ఫిదా!