మన భారతదేశంలో ఉన్న ప్రజలు దాదాపు ఏ చిన్న పండుగనైనా తమ కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటారు.అలాగే మన దేశంలో చాలా మంది ప్రజలు భక్తితో దేవాలయాలకు వెళుతూ ఉంటారు.
అలాంటి ఈ దేశంలో సైన్స్ ఎంత ఉంటుందో దేవుడి భక్తి, దయ్యం కూడా అంతే అంటూ చాలామంది ప్రజలు నమ్ముతారు.ఈ విధంగా ప్రజలంతా సమస్యలు వస్తే దేవుడి ముందు బాధలు చెప్పుకుంటూ ఉంటారు.
అంతే కాకుండా దేవున్ని ఎన్నో కోరికలు కూడా కోరుతూ ఉంటారు.ఈ కోరికలు కోరే సమయంలో ముడుపులు వేస్తూ ఉంటారు.
ఈ ముడుపులు వేయడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది.ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి( Venkateswara Swamy )కి ముడుపు ఈ విధంగా వేస్తే ఎలాంటి కోరిక ఆయన నెరవేరుతుంది.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఒక తెల్లని వస్త్రం తీసుకొని, ఆ తర్వాత ఒక శుభ్రమైన పాత్రలో పసుపు పచ్చ కర్పూరం, గంధం కాస్త నీళ్లు వేసి కలపాలి.
ఆ తర్వాత ఆ తెల్లని గుడ్డ( White cloth )ను తీసుకొని అందులో పూర్తిగా ముంచలి.ఆ తర్వాత కాసేపు ఆరబెట్టాలి.వస్త్రం ఆరిన తర్వాత శుభ్రమైన పాత్రలో పరిచి ఆ గుడ్డ నాలుగు దిక్కుల నాలుగు కుంకుమ బొట్లు,అలాగే మధ్యలో ఒక బొట్టు పెట్టాలి.
ఆ తర్వాత అందులో అక్షింతలు, తులసీదళం వేయాలి.అంతే కాకుండా ఏడు ఎండు ఖర్జూరాలు( Dry dates ), ఏడు లవంగాలు ఏడు యాలకులు, జవ్వాది పౌడర్, పచ్చ కర్పూరం పొడి, డబ్బులు వేయాలి.ఆ తర్వాత ఆ వస్త్రన్ని మూడు ముళ్ళు వేసి ఒక మూటలా కట్టాలి.
ఆ మూటను వెంకటేశ్వర స్వామి మూడు నామాలు లాగా మూడు బోట్లు పెట్టాలి.ఆ తర్వాత మనం ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి కోరికలు కోరుకునీ ముడుపు కట్టి వచ్చేయాలి.
దీని వల్ల మనం అనుకున్న పని తప్పనిసరిగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.