పవన్ కల్యాణ్.మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టి.
కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు.అన్న పేరుతో సినిమాల్లోకి అడుగు పెట్టినా.
సొంత టాలెంట్ తో టాప్ హీరోగా ఎదిగాడు పవన్ కల్యాణ్.సినిమాల్లో ఎంత జోష్ ఫుల్ గా ఉంటాడో.
బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడు పవర్ స్టార్.కెరీర్ మధ్యలో వరుస ఫ్లాపులతో సతమతమైనా.
ఆ తర్వాత మల్లీ పుంజుకున్నాడు.మంచి హిట్లు సాధిస్తూ మునుపటి వైభవం దిశగా అడుగులు వేశాడు.
తాజాగా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది గబ్బర్ సింగ్ మూవీ.పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఓ రేంజిలో వినోదాన్ని పంచింది.నిజానికి ఈ సినిమా రీమేక్ మూవీ.అయినా.
ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు.తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కించారు.
ఈ సినిమా తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమా పవన్ కల్యాణ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.
బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు అసెట్ గా నిలిచింది.
ఆ తర్వాత వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు చేశాడు.కరోనా అనంతరం వకీల్ సాబ్ తో మరో బ్లాక్ బస్టర్ సాధించాడు.
ఈ సినిమాలకు శంకర్ మహదేవన్ కు ఓ సంబంధం ఉంది.ఆయన పవన్ కల్యాణ్ కు చెందిన ఏ సినిమాలో పాడినా.ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది.పైన చెప్పుకున్న సినిమాల్లో మూడింటిలో శంకర్ మహదేవన్ తన వాయిస్ వినిపించాడు.ఆ సినిమాలన్నీ చక్కటి విజయాన్ని అందుకున్నాయి.అంటే పవన్ కల్యాణ్, శంకర్ మహదేవన్ ది హిట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు.