ఇంద్రుని అహంకారాన్ని అణిచిన కృష్ణార్జునులు... ఎలా అంటే?

స్వర్గానికి అధిపతిగా ఇంద్రుడిని భావించి పూజిస్తారు.స్వర్గానికి అధిపతి కావడం వల్ల ఎంతో గర్వంగా ప్రజలందరూ తన దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నారని, ఇంద్రుడిని భూలోక ప్రజలు భక్తిభావంతో కొలిస్తే కానీ వారికి మనుగడ ఉండేది కాదు.

 Khandava Vanam, Mythological Story, Krishnarjuna History, Indrudu Special Story,-TeluguStop.com

అయితే ఇంద్రుడి పొగరుబోతు తనం సాక్షాత్తు ఆ దేవతలు కూడా సహించలేకపోయారు.ఎలాగైనా ఇంద్రుని గర్వాన్ని అణచాలని కృష్ణార్జునులు ఇద్దరు ఎత్తులు వేస్తారు.

ఎప్పటికప్పుడు ఇంద్రుడి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఇంద్రుడు పై గెలుపును సాధిస్తారు.

ఇందుకు మంచి ఉదాహరణ గోవర్ధన గిరి కథను తీసుకోవచ్చు.

గోకులంలో కుండపోతగా వర్షాలు కురుస్తూ గోకులంలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడి ప్రజలను గోవర్ధన పర్వతం ఎత్తి కుండపోత వర్షం నుంచి రక్షిస్తాడు ఈ విధంగా కృష్ణుడు,ఇంద్రుడు మధ్య పరస్పర మనస్పర్ధలు ఏర్పడతాయి.ఈ తరహాలోనే వీరిద్దరి మధ్య మరో య కూడా జరుగుతుంది అందులో ఇంద్రుడు ఓటమిని చవిచూశాడు.

పూర్వం వేసవిలో కృష్ణార్జునులు వేసవి తాపం భరించలేక వేసవి తాపం నుంచి విముక్తి పొందేందుకు ఖాండవ వనం అనే ప్రాంతానికి వెళ్లి, యమునా నది తీరానికి వెళ్లి సేదతీరుతున్న సమయంలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి తనకు సహాయం చేయవలసినదిగా వారిని కోరుతాడు.తను ఎంత తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తన వ్యాధిని నయం చేయవలసిందిగా కృష్ణార్జునలను వేడుకుంటారు.

అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్న తరువాత ఆ బ్రాహ్మణుడు అగ్ని దేవుడిగా ప్రత్యక్షమవుతాడు.

ప్రత్యక్షమైన అగ్నిదేవుడు తను ఎన్నో రోజులుగా ఆ  ఖాండవ వనాన్ని దహించాలని అనుకున్నట్లు వారితో చెబుతాడు.

అలా చేయడం వల్ల ఈ భూమి మరింత సారవంతంగా పెరిగి ఎన్నో జీవరాశులకు నిలయంగా మారుతుందని తెలియజేశాడు.అయితే ఈ ఖాండవ వనంలో దక్షుడు అనే సర్పరాజు ఇంద్రుడికి స్నేహితుడు కావడం వల్ల తనను రక్షించడానికి ఖాండవవనాన్ని దహించాలి అనుకున్నప్పుడు ఇంద్రుడు వరుణదేవుని పంపించి తన పనికి అడ్డుపడుతున్నాడని తనకు సహాయం చేయవలసిందిగా వారిని ప్రార్థిస్తాడు.

అగ్ని దేవుడికి సహాయం చేస్తానని మాట ఇచ్చిన కృష్ణార్జునలకు సహాయంగా వరుణదేవుడు గాండీవం అనే ధనుస్సును అర్జునుడుకి ఇవ్వడం వల్ల అర్జునుడు ఖాండవ వనం పై బాణాలను వదులుగా అగ్నిదేవుడు ఆ వనాన్ని కాల్చడానికి సిద్ధమవుతాడు.యధాప్రకారం ఇంద్రుడు వరుణుని కిందకు పంపించగా ఒక్క చినుకు కూడా నేల పడకుండా అర్జునుడు కాపాడుతాడు.

ఇంతలోనే అగ్నిదేవుడు ఖాండవవనాన్ని మొత్తం దహించి వేస్తాడు ఈ విధంగా కృష్ణార్జునులు చేతిలో మరొకసారి ఓటమిని చవి చూస్తారని మన పురాణాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube