మన దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి( Sri Rama Navami ) వేడుకలను ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం శ్రీరామనవమి మార్చి నెల 30వ తేదీన వచ్చింది.
చంద్రమాన మాసం శుక్లపక్షంలో వచ్చే చైత్ర నవరాత్రులలో 9వ రోజు శ్రీరామ నవమి జరుపుకుంటారు.హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం శుక్లపక్షంలో నవమి రోజు శ్రీరాముడు దశరథ మహారాజు కౌసల్యకు( Dasharatha ) జన్మించాడు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పాటించాల్సిన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే నిద్ర లేచి మీ ఇంటిని, పరిసర ప్రాంతాలని అలాగే పూజగదిని శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత తన స్నానం చేయాలి, అంతే కాకుండా దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి ప్రసాదాన్ని తయారు చేసుకునే ఉంచుకోవాలి.అంతేకాకుండా మీ పూజ గదిలో శ్రీరాముని విగ్రహాన్ని లేదా ఫ్రేమ్ ని ఉంచాలి.
చందనం, ధూపంతో దేవుడికి హారతి ఇవ్వాలి.ముఖ్యంగా రామాయణం( Ramayana ) లేదా ఇతర పవిత్ర గ్రంధాలను చదవాలి.
శుభ ముహూర్తం సమయంలో దేవునికి హారతి ఇవ్వడం మంచిది.శ్రీరామనవమి సందర్భంగా పూజ సమయం ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అంటే రెండు గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే చైత్ర మాస నవరాత్రుల తొమ్మిది రోజుల పండుగకు ప్రతి ఒక్కరు వ్రతం చేస్తారు లేదా ఉపవాసం ఉంటారు.
శ్రీరామనవమి వ్రతాన్ని ఆచరించడం వల్ల చేసిన పాపాలన్నీ దూరమైపోతాయని పెద్దవారు నమ్ముతూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు లేదా 12 గంటల వరకు ఉపవాసం ఉండాలి.అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండవచ్చు.
రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాలి.అయితే ఒకసారి భోజనంలో పండ్లు, పండ్ల రసాలు, తేలికపాటి పానీయాలు అంటే పాలు లేదా నీటి ఆధారిత పానీయాలను తీసుకోవడం మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, పసుపు లేకుండా భోజనం చేయడం మంచిది.