వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్( Rapaka Varaprasad ) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.గత ఎన్నికల్లో జనసేన( Janasena ) తరుపున పోటీ చేసి గెలిచిన రాపాక.
ఆ తరువాత వైసీపీ ( YCP )గూటికి చేరారు.ఇక ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో దుమరాన్ని రేపాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు కొనుకునేందుకు ప్రయత్నించిందని, టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 10 కోట్లు ఇస్తామని టీడీపీ శ్రేణులు ఆఫర్ చేశారని రాపాక చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో ఒక్కసారిగా హీట్ ను పెంచాయి.వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ప్రలోభం చూపి చంద్రబాబు( Chandrababu) తనవైపు తిప్పుకున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో రాపాక చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
![Telugu Chandrababu, Cm Jagan, Janasena-Politics Telugu Chandrababu, Cm Jagan, Janasena-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/03/JanasenaYCPChandrababu.jpg)
మరోవైపు డబ్బుతో ప్రలోభ పెట్టాల్సిన అవసరం తమకు లేదని జగన్ పై ఉన్న వ్యతిరేకత కారణంగానే వైసీపీ ఎమ్మేల్యేలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో తను దొంగ ఓట్లతో గెలిచినట్లు చెప్పి రాపాక మరో బాంబ్ పేల్చారు.తాను దొంగ ఓట్లతో గెలిచానని, తన సొంత ఊరు చింతలమోరులోని తన అనుచరులు ఒక్కరూ పదేసి దొంగఓట్లు వేశారని రాపాక చెప్పుకొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేగా రాపాక నిలిచారు.
![Telugu Chandrababu, Cm Jagan, Janasena-Politics Telugu Chandrababu, Cm Jagan, Janasena-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/03/Rapaka-Varaprasadcm-jagan.jpg)
పార్టీ అధ్యక్షుడు పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికి.రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక మాత్రం గెలుపొందారు.ఆ టైమ్ లోనే రాపాక గెలుపుపై ఎన్నో సందేహాలు పెల్లుబుక్కాయి.అధ్యక్షుడికే తప్పని ఓటమి.రాపాక మాత్రం ఎలా గెలుపొందారనే సందేహం అందరిలోనూ వ్యక్తమైంది.ఇప్పుడు తన గెలుపుపై వ్యాఖ్యలు చేస్తూ దొంగ ఓట్లతో గెలిచానని రాపాక చెప్పడం గమనార్హం.
అయితే రాపాక తన మనసులోని మాట వెళ్ళగక్కారా ? లేదా యాదృద్చికంగా చెప్పుకొచ్చారా ? అనే సంగతి పక్కన పెడితే.తనకు తాను నోరు జారీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాపాక చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పెట్టె విధంగానే ఉన్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.ఎందుకంటే ప్రస్తుతం రాపాక వైసీపీలో ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో రాపాక దొంగ ఓట్ల వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.