మన భారతదేశంలో ఎన్నో వందల సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఆ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వచ్చి భగవంతులను దర్శించుకుని పూజలు చేసి సంతోషంగా వెళుతూ ఉంటారు.
ఎందుకంటే భారతీయ సంస్కృతిలో పూజలకు అంతా ప్రాముఖ్యత ఉంది మరి.వారంలో ఉన్న ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం చేయబడి ఉంది.ఇలా సోమవారం రోజుని పరమేశ్వరుడికి అంకితం చేశారు.అందువలన దేశవ్యాప్తంగా ప్రజలందరూ సోమవారం రోజున భోళా శంకరుడికి పూజలు చేస్తూ ఉంటారు.అభిషేక ప్రియుడైన పొలాశంకరుడికి నిత్యం గంగాజలం,పండ్లు, పంచామృతులతో అభిషేకం చేయడమే కాకుండా పండ్లు పరమాన్నం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించి ఎంతో ఘనంగా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.
కానీ పరమశివునికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టే దేవాలయం కూడా ఉందని తెలుసా.
పురాణాల ప్రకారం పరమశివునికి పరమ భక్తుడైన భక్త కన్నప్ప శివునికి నిత్యం మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు.అయితే ఇప్పటి వరకు దేవాలయంలో కొలువై ఉన్న శివుడికి అక్కడికి గ్రామస్తులు మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు.అనంతపురం జిల్లా పెనుగొండలోని మడకశిర లో ఉన్న ఈ ఆలయాన్ని స్వయంభుగా భక్తులే నిర్మించాలని పురాణాలలో ఉంది.1200 సంవత్సరాలు క్రితం ఇక్కడ నివసించే ప్రజలు వేరు వేరు ప్రదేశాలకు వెళ్లి జీవించడం వల్ల ఈ గ్రామం శిథిలం అయిపోయింది.

ఆ తర్వాత కొంతకాలానికి ప్రజలు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడినట్లు సమాచారం.అయితే ఇక్కడ ప్రజలకు శివలింగం, ఆంజనేయ స్వామి విగ్రహం, మహిషాసుర మర్దిని విగ్రహం లభించడంతో వాటిని స్వయంగా ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మించారు.ఈ గ్రామంలోని ప్రజలు ఈ శివలింగాన్ని నీలకంఠేశ్వర స్వామిగా పిలవడం వల్ల ఈ గ్రామానికి నీలకంఠాపురం అని పేరు వచ్చింది.ఈ గ్రామంలో ప్రజలు ఇప్పటికీ శివునికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు.
ఇలా పరమేశ్వరునికి మాంసాన్ని సమర్పించిన ఏకైక ఆలయం ఇదే కావడం విశేషం.ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆచారం ఈ గ్రామంలో కొనసాగుతూ ఉంది.