మనం ఇల్లు కట్టుకోవాలంటే వాస్తు చూసుకొని నిర్మిస్తూ ఉంటాం.అయితే ఇల్లు మాత్రమే కాకుండా ఏం పని మొదలుపెట్టినా కూడా ముహూర్తం చూస్తూ ఉంటాం.
ఇలా ప్రతి పని వాస్తు ప్రకారం( Vasthu ) చేస్తే మన ఇంట్లో వస్తువులను కూడా వాస్తు ప్రకారమే ఏ దిశలో పెట్టాలో, ఆ దిశలోనే పెడుతూ ఉంటారు.ఒకవేళ సరైన పద్ధతిలో వస్తువులు పెట్టకపోతే దాని నుండి మన ఇంట్లో ప్రతికూల ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది.
ఒక ఇంట్లో ఉండే విలువైన వస్తువులు, డబ్బు, బంగారం లాంటివి ఇంట్లోని పరిస్థితులను డిసైడ్ చేస్తాయి.విలువైన వస్తువులను సరైన దిశలో పెడితే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అయితే వాస్తు ప్రకారం విలువైన ఆభరణాలు ఇంటికి కుడివైపున ఉంటే మంచిది అంట.బంగారు ఆభరణాలు అలాగే ఇతర ఆభరణాలన్నీ కూడా కుడివైపున ఉంచితే మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది.అలాగే లాకర్లు, బీరువాలు( Lockers ) లాంటివి ఉంటే ఆ బరువైన వస్తువులను ఇంటికి నైరుతి దిశలో ఉంచడం మంచిదని చెబుతున్నారు.అంతేకాకుండా దక్షిణ దిశలో ఉండేలా చూసుకోవాలి.
అయితే ఈ రెండు దిశల్లో మన బంగారు ఆభరణాలు పెడితే సానుకూల ఫలితాలు వస్తాయి.అంతే కాకుండా ఉత్తర దిశ అంటే కుబేరుని( Kubera )గా పరిగణిస్తారు.
ఈ దిశలో బంగారాన్ని పెడితే సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు.

ఇలా చేస్తే దరిద్ర దేవత తిష్ట వేస్తుందని నెగటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు.ఒకవేళ ఈ బంగారాన్ని భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి వీలైనంతవరకు ఇంట్లో ఉండే అన్ని బంగారు అభరణాలు అలాగే ఇతర అభరణాలు సరైన దిశలో పెట్టాల్సి ఉంటుంది.
అలాగే ఈ విధంగా పెట్టడం వలన మీ ఇంటికి, అలాగే మీ బంగారు ఆభరణాలకు మంచి జరుగుతుంది.అంతేకాకుండా ఇంట్లో వస్తువులు కూడా అన్ని వాస్తు ప్రకారమే పెట్టుకోవాలి.