శనీశ్వరుని పూజిస్తే... సిరి సంపదలు మీ వెంటే!

శని ఈ పేరు వినగానే చాలామందిలో భక్తి కన్నా భయం ఎక్కువ కలుగుతుంది.శని దేవుడిని పూజించడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయని చాలామంది అపోహ పడుతుంటారు.

 Saturday, Sanishwarudu Pooja Vidhanam, Saturday Pooja In Telugu-TeluguStop.com

కానీ వాస్తవానికి అది ఏమాత్రం నిజం కాదు.నవగ్రహాలలో శనిగ్రహం ఒక్కటి.

శనివారం శని దేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు.శనివారం శని దేవుని భక్తి శ్రద్ధలతో పూజించిడం వల్ల ఆయన అనుగ్రహం కలిగి, ఏళ్లతరబడి ఉన్న శని పోగొట్టుకోవచ్చు.

శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సిరి, సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.మరి శని పూజ ఎలా నిర్వహించాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం

మనకు శనీశ్వరుని దేవాలయం అందుబాటులో లేకపోతే, నవగ్రహాలకు వెళ్లి శనీశ్వరుని దర్శించుకోవాలి.

అలా వెళ్లేటప్పుడు నల్లటి నువ్వులను తీసుకొని, నవగ్రహాలలోని శని పాదాల ముందర వాటిని సమర్పించాలి, అలాగే నువ్వుల నూనెతో శనీశ్వరునికి తలనుండి పాదాల వరకూ వచ్చేలా నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

అలాగే నల్లటి వస్త్రమును తీసుకొని శనీశ్వరుని మెడలో మాలగా ధరించవలెను.శనీశ్వరుని పూజ చేసేటప్పుడు ముదురు నీలం రంగు దుస్తులు లేదా నలుపు రంగు దుస్తులు ధరించ వలెను.

శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు శనీశ్వరుడిని మాటిమాటికి శని, శని అని పిలవకూడదు.

శనివారం రోజున రావిచెట్టుకు, మీరు పాలతో కలిపిన చక్కెరను పోసి, దీపం వెలిగించడం ద్వారా శనీశ్వరుని దయ.ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.శనివారం పేదలకు దానం చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం మీకు కలుగుతుంది.

శనివారం రోజు ఎరుపు రంగు మిరియాలకు బదులుగా నలుపు రంగు మిరియాలను వాడాలి.శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వుల నూనెను, నువ్వులను, ఇనుప వస్తువులను ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదు.

అలా చేయడం ద్వారా శుభఫలితాలు కలుగవని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube