అకస్మాత్తుగా బరువు త‌గ్గారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

ఒక్కోసారి కొంద‌రు అక‌స్మాత్తుగా బ‌రువు త‌గ్గి పోతారు.ఎటు వంటి డైట్‌లు పాటించ‌క‌పోయినా, రోజూ వ్యాయామాలు చేయ‌క‌పోయినా, మీరు తీసుకునే ఆహారంలో మార్పు లేక‌పోయినా.

 Reasons For Losing Weight Without Trying! Reasons For Losing Weight, Losing Weig-TeluguStop.com

బ‌రువు త‌గ్గారు అంటే ఖ‌చ్చితంగా కొన్ని విష‌యాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.సాధార‌ణంగా శ‌రీరంలో ఏవైనా స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ప్పుడు బ‌రువు పెరుగుతారు.

అలాగే కొన్ని స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ప్పుడు బ‌రువు త‌గ్గుతారు కూడా.మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏంటీ.? అస‌లు వాటి వ‌ల్ల బ‌రువు ఎందుకు త‌గ్గి పోతారు.? వంటి విష‌యాల‌ను ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్త‌వానికి షుగ‌ర్ వ్యాధి లేదా మ‌ధుమేహం బారిన ప‌డితే చాలా మంది వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు.అయితే కొంద‌రు వెయిట్ లాస్ కూడా అవుతారు.అవును, ఉన్న‌ట్టు ఉండి బ‌రువు త‌గ్గ‌డం అనేది షుగ‌ర్ వ్యాధి ల‌క్ష‌ణాల్లో ఒక‌టిగా చెప్పుకోవ‌చ్చు.శరీరం గ్లూకోజ్‌ను గ్రహించ లేక పోడ‌వం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంటుంది.

Telugu Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్ టి

అలాగే డిప్రెష‌న్‌లో ఉన్నా అకస్మాత్తుగా బ‌రువు కోల్పోయే అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంటుంది.ఫ‌లితంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టేస్తాయి.అందుకే డిప్రెష‌న్ నుంచి ఎంత త్వ‌ర‌గా బ‌యట ప‌డితే.ఆరోగ్యానికి అంత మంచిది. థైరాయిడ్ సమస్యల బారిన ప‌డినా కొంద‌రు విప‌రీతంగా బ‌రువు కోల్పోతారు.ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం ల‌క్ష‌ణాల్లో ఉన్న‌ట్టు ఉండి బ‌రువు త‌గ్గ‌డం కూడా ఒక‌టి.

అంతేకాదు.క్యాన్స‌ర్ క‌ణితిలు ఏర్ప‌డినా, పేగు వ్యాధులు, కండరాలు బలహీనంగా మార‌డం, అధిక ఒత్తిడి, కీళ్ల నొప్పులు, నరాలు దెబ్బతినడం వంటివి కూడా ఆకస్మికంగా బరువు త‌గ్గ‌డానికి కార‌ణాలు అవుతుంటాయి.అందుకే మీరు వెయిట్ లాస్ అవ్వ‌డానికి ప్ర‌య‌త్నించ‌క‌పోయినా.బ‌రువు త‌గ్గి పోతున్నారు అంటే ఖ‌చ్చితంగా ఆరోగ్య నిపుణులు సంప్ర‌దించి ఫుల్ బాడీ చ‌క‌ప చేయించు కోవాల్సి ఉంటుంది.

లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube