1.200 విమానాలను కొనుగోలు చేయనున్న ఎయిర్ ఇండియా
టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియా మరో రెండు వందలు కొత్త విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.
2.ఆర్మీలో అగ్నివీర్ తొలి నోటిఫికేషన్ విడుదల
అగ్నిపత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ లో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
3.తమిళనాడు సీఎం కు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
4.నేటి నుంచి సింగరేణి పోస్టులకు దరఖాస్తులు
తెలంగాణలో ఉద్యోగాల జాతర లో భాగంగా క్లర్క్ నోటిఫికేషన్ విడుదలైంది.177 ఎక్స్ టర్నల్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
5.నేడు కాంగ్రెస్ ఎంపీల అత్యవసర సమావేశం
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం అత్యవసర సమావేశం కానున్నారు.
6.గురుకులాల్లో ప్రవేశానికి ముగిసిన పరీక్ష
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలలో 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.4 మంది విద్యార్థులు హాజరయ్యారని కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.
7.బండి సంజయ్ కామెంట్స్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కలవడం తప్పేముందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
8.శ్రీశైలం అడవి ప్రాంతంలో అరుదైన పక్షి గుర్తింపు
శ్రీశైలం అడవి ప్రాంతంలో అరుదైన పక్షి ని ఆశాఖ రేంజర్ మొహమ్మద్ గుర్తించారు.
నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నల్లమల లో కొంతకాలంగా పక్షులు , జంతువుల పరిశోధనలు చేస్తున్న ఫారెస్ట్ రేంజర్ మహమ్మద్ తెలిపారు.నల్లమల లో అరుదైన చుక్కల పొట్ట గద్ద ఆకారపు గుడ్ల గూబ ను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
9.ఏడో రోజుకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ఏడో రోజుకు చేరింది.మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.
10.నేడు హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 21న జరగనున్న యోగ డే కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు.
11.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 236 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
12.ఏపీ ,కర్ణాటక మహారాష్ట్ర ల్లోనూ కార్గో
టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలను ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర లోని నగరాలకు విస్తరించినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
13.శ్రీకాకుళం లో ఎలుగుబంటి బీభత్సం
శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం లో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది.గ్రామంలో దాదాపు ఏడుగురు పై ఎలుగుబంటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
14.జగన్ ను కలిసిన మంత్రి పెద్దిరెడ్డి , టీటీడీ ఈవో
ఏపీ సీఎం జగన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కలిసారు.
15.కెసిఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
బాసర ట్రిపుల్ ఐటీ లో ఏడు రోజులుగా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వారి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు.
16.రైల్వే స్టేషన్లలో భారీ భద్రత
భారత్ బంద్ నేపథ్యంలో అన్ని రైల్వేస్టేషన్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
17.మంత్రుల ఎన్నికల ప్రచారం
ఆత్మకూరు ఒక ఎన్నికలలో వైసీపీ తరఫున మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
18.అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం
ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై నెల్లూరులో అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమావేశమయ్యారు.
19.అన్నవరంలో భక్తుల ఇబ్బందుల పై చర్చ
నేడు అన్నవరంలో ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది ఈ సమావేశంలో దర్శనానికి వచ్చే భక్తులఇబ్బందులు, వారు లేవనెత్తిన ఇబ్బందులపై చర్చించనున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,750 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,080
.