ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వాహనాలపై ప్రయాణించే సమయంలో తీసిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.వినోదం కోసం రూపొందించిన ఈ వీడియోల్లో కొన్నింటి వెనుక సమాజానికి హానికరమైన సందేశాలు దాగి ఉంటున్నాయి.
ప్రత్యేకంగా యువత ఈ తరహా వీడియోలను ఎక్కువగా చేయడానికీ వెనుకాడటం లేదు.తాజాగా ఇలాంటి ఓ ప్రమాదకర వీడియో వైరల్ అవుతోంది.
ఇద్దరు యువకులు కారులో ప్రయాణిస్తూ ఉండగా.అందులో వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి మద్యం తాగుతూ ఉండడం గమనించవచ్చు.అయితే, రోడ్డుపై అదే సమయంలో ఒక బైక్ మీద(On a bike) వెళ్తున్న ఇద్దరిలో వెనుక కూర్చున్న వ్యక్తికి మద్యం ఆఫర్ చేస్తూ కనిపించారు.వారు కారులో నుంచి మద్యం బాటిల్ ఓపెన్ చేసి, బైక్ రైడర్ గ్లాసులో మద్యం పోస్తూ హెల్ప్ (Help pouring alcohol into a bike rider’s glass)చేస్తున్నట్టు.
ఆ తర్వాత ముందు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మందు లోకి సోడా కలుపుతున్నట్లుగా కొన్ని నీళ్లు పోయడం కూడా వీడియోలో కనిపించింది.ఇది చూసిన కొందరు నెటిజన్లు సరదాగా తీసుకుంటూ, “లిక్కర్ మేటర్స్ లో వీళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తారు” అంటూ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు.
ఇది చూడటానికి ఫన్నీగా అనిపించొచ్చు కానీ, ఇది పూర్తిగా తప్పు, ప్రమాదకరం, శిక్షార్హమైన చర్య.డ్రైవింగ్ చేస్తున్నపుడు మద్యం తాగడం, లేక మద్యం ఇవ్వడం ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) ప్రకారం పెద్ద నేరం.పైగా, ఒక వాహనంలో నుంచి మరో వాహనానికి ఏదైనా వస్తువు ఇవ్వడం ప్రమాదకరమైన చర్య.ఇది ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుంది.
ఈ వీడియో స్క్రిప్టెడ్ అయి ఉండవచ్చు, అయినా దాని నుంచి వచ్చే మెసేజ్ మాత్రం ప్రమాదకరం.యువత ఇందులో చూపిన పని కాస్త ఫన్నీగా చేయాలని అనుకుంటే, అది నేరానికి దారితీస్తుంది.మన దేశంలో ఇప్పటికే రోజూ వందలాది రోడ్డు ప్రమాదాలు మద్యం వల్లనే జరుగుతున్నాయి.ఇలాంటి సమయంలో ఈ తరహా వీడియోలు “ఫన్” పేరిట ప్రచారం కావడం బాధాకరం.
వినోదం పేరిట ఇలాంటి నేరాలకు ప్రోత్సాహం ఇవ్వకూడదు.మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది.
ఆ బాధ్యత అందించడమే నిజమైన సోషల్ మీడియా వినియోగం.