శ్రీదేవి వారసురాలిగా నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న జాన్వీ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఈమె రాంచరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది(Peddi) సినిమాలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ కపూర్ కు ప్రముఖ బిజినెస్ ఉమెన్ నుంచి ఊహించని కానుక వచ్చిందని చెప్పాలి.ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తే అనన్య(Ananya).ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డు (ABFRL) డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న అనన్య నటి జాన్వీ కపూర్ కు ఏకంగా ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన కానుకను పంపించారు.
శుక్రవారం ఉదయం పర్పుల్ కలర్ లంబోర్గిని కారు(Lamborghini car)ను జాన్వీ నివాసానికి పంపించారు.ఆ కారుతో పాటు మరో గిఫ్ట్‌ను సైతం అందులో ఉంచారు.ఆ గిఫ్ట్ ప్యాక్‌పై ‘ప్రేమతో నీ అనన్య’ అని రాసి ఉంది.

ఇలా వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఎంతో మంచి స్నేహబంధం ఉన్న నేపథ్యంలోనే అనన్య జాన్వీ కోసం ఈ ఖరీదైన కానుకను పంపించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే అనన్య ఇటీవల సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.
దీనికి జాన్వీకపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.ఇలా తన స్నేహితురాలు తన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ఆమెకు రెమ్యూనరేషన్ కాకుండా ఇలా కారును బహుకరించారని తెలుస్తోంది.