కొందరికి ముఖంతో సహా శరీరం మొత్తం తెల్లగా, మృదువుగా మెరిసిపోతుంటుంది.కానీ.
మోకాళ్లు, మోచేతులు మాత్రం నల్లగా, గరుకుగా చూసేందుకు అందవిహీనంగా కనిపిస్తుంటాయి.దాంతో ఆ నలుపును వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో క్రీములు యూజ్ చేస్తుంటారు.
కొందరు వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.అయితే వాస్తవానికి ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు మన వంటింట్లోనే బోలెడడన్ని ఉన్నాయి.
వాటిలో కొన్ని టిప్స్ గురించి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల రెగ్యులర్ షాంపూ, వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల టమోటా జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల పెసర పిండి వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులకు అప్లై చేసి.పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై మెల్లగా స్క్రబ్ చేసుకుంటూ వాటర్‌లో క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే మోకాళ్లు మరియు మోచేతులు తెల్లగా, మృదువుగా మారతాయి.

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.ఆపై వేళ్లతో బాగా రుద్దుకుంటూ వాటర్‌తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.అనంతరం తడి లేకుండా టవల్‌తో తుడుచుకుని.ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
కాబట్టి, ఈ టిప్స్‌ను తప్పకుండా ట్రై చేయండి.