మనిషి అందంగా కనబడేందుకు శరీర ఆకృతితో పాటు ముఖం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ముఖం మంచి మెరుపును కలిగి ఉంటే మనిషి ఎప్పుడూ అందంగా కనిపిస్తూ ఉంటాడు.
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు వస్తున్నాయి.దీని కారణంగా చాలామంది తమ అందన్ని కోల్పోతున్నారు.
అయితే ముఖాన్ని మెరిపించుకునేందుకు చాలా మంది మార్కెట్లో లభించే రకరకాల రసాయనాలతో కూడిన ఫేస్ క్రీమ్ లను వినియోగిస్తూ ఉంటారు.వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో చాలా రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
వీటికి బదులుగా ఇంట్లో లభించే సాధారణ పదార్థాలతో కూడా సులభంగా మొటిమల సమస్య( Pimples ) నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ప్రతిరోజు వినియోగించడం వల్ల మొటిమలు తగ్గిపోయి చర్మం మిగుతగా కూడా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఎప్పుడూ స్కిన్ సమస్యలతో బాధపడేవారు దీనిని వినియోగించడం వల్ల ఊహించని ఫలితాలను పొందవచ్చు.ఇంతకీ ఈ చిట్కా ఏంటో ఇంట్లో లభించే పదార్థాలతో ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే పసుపు( Turmeric )లో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి.కాబట్టి చాలామంది పసుపును ఔషధంగా భావించి ఆహారాల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.

అయితే పసుపు తేనె( Honey ) కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు మొహానికి అప్లై చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉండే గుణాలు ముఖంపై మచ్చలను తొలగించడమే కాకుండా ముఖాన్ని అందంగా చేసేందుకు ప్రభావంతంగా పనిచేస్తాయి.పసుపు తేనే మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న కప్పు పసుపును తీసుకోవాల్సి ఉంటుంది.ఈ పసుపును మరొక కప్పులో వేసుకొని అందులోనే అరకప్పు తేనెను కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉపయోగించాలి.దీనిని వినియోగించే ముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.ఈ మిశ్రమాన్ని వినియోగించాలనుకునేవారు ముందుగా ముఖాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత దీనిని మొహానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు వేచి ఉండి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.