పాదాల పగుళ్లు ( Cracked feet )అత్యంత బాధాకరమైన సమస్యల్లో ఒకటి.పగుళ్ల కారణంగా కొందరు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
చర్మం పొడిబారడం, సరిగ్గా సరిపోని బూట్లు ధరించడం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు, అధిక బరువు, వృద్ధాప్యం, పాదాల పరిశుభ్రత లేకపోవడం తదితర కారణాలు పగుళ్లకు దారితీయవచ్చు.అయితే ఈ సమస్యను పరిష్కరించే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.

రెమెడీ 1:
ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ ( White toothpaste )వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ వాసెలిన్( Vaseline ), వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటిలో పాదాలను ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఇలా నానబెట్టుకున్న పాదాలకు తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో అప్లై చేసి కనీసం నాలుగైదు నిమిషాల పాటు తోముకోవాలి.
ఫైనల్ గా వాటర్ తో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటించారంటే పగుళ్లు మాయం అవుతాయి.పాదాలు మృదువుగా కోమలంగా మారతాయి.

రెమెడీ 2:
ఒక టబ్ తీసుకుని అందులో పాదాలు మునిగేలా గోరువెచ్చని నీటిని పోసుకోవాలి.ఇప్పుడు వాటర్ లో అరకప్పు తేనె మరియు అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా ఫిక్స్ చేసుకోవాలి.ఆపై పాదాలను వాటర్ లో ఆరేడు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
అనంతరం ప్యూమిస్ స్టోన్ తో పాదాలను బాగా రబ్ చేసుకోవాలి.మరోసారి వాటర్ లో ఐదు నిమిషాలు పాదాలను పెట్టి మళ్ళీ ప్యూమిస్ స్టోన్ తో రబ్ చేసుకోవాలి.
ఇలా రెండుసార్లు చేసిన అనంతరం నార్మల్ వాటర్ తో పాదాలను శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైసర్ అప్లై చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని పాటించిన కూడా పాదాల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.
మృదువైన అందమైన పాదాలు మీ సొంతమవుతాయి.