ఏందిరా అయ్యా.. బట్టతలపై జుట్టు వస్తుందంటే ఇంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారా.?

సోషల్ మీడియా(Social media) వేదికగా ప్రజలను ఆకర్షించేందుకు చాలా మంది నకిలీ వ్యక్తులు సాధ్యం కానీ ప్రమాణాలతో నమ్మదగని ప్రకటనలు చేస్తూ, అమాయకుల్ని బలి చేస్తుండటం ఇటీవల పెరిగిపోయింది.ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు, గోప్యమైన సమస్యలపై చక్కని పరిష్కారం చూపుతానంటూ, ఫేక్ ట్రీట్‌మెంట్‌తో మోసాలు చేస్తున్నారు.

 What's Up, Sir? Are There So Many People Who Believe That Hair Grows On Bald Hea-TeluguStop.com

తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనకు ఓ నకిలీ బట్టతల వైద్యుడు తెరతీశాడు.

ఓ సమయంలో బిగ్‌బాస్‌ షోలో (Bigg Boss show)పాల్గొన్నట్టుగా చెప్పుకుంటూ ఒక వ్యక్తి, తాను పూర్తిగా బట్టతలపై సహజంగా జుట్టు మొలిపించగలనంటూ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం మొదలుపెట్టాడు.

త్వరలోనే హైదరాబాద్‌ (Hyderabad)వస్తున్నాను… బట్టతల బాధితులంతా రెడీగా ఉండండి అంటూ ఎగ్జయిటింగ్ పోస్ట్‌లు షేర్ చేస్తూ హైప్ క్రియేట్ చేశాడు.దీంతో బట్టతలతో ఇబ్బంది పడుతున్న వందలాది మంది వ్యక్తులు ఆశతో ఎదురుచూశారు.

తన మిత్రుడికి హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న సెలూన్ షాప్‌లో అందరికి చికిత్స అందిస్తానని చెప్పిన వకీల్‌ అనే వ్యక్తి, ఏప్రిల్ 6న నగరానికి వచ్చాడు.శనివారం, ఆదివారం రోజుల్లో వందలమంది బాధితులు క్యూ కట్టారు.ఒక్కొక్కరి తలకు రూ.200 వసూలు చేసి గుండ్లు కొట్టి, ఏదో లిక్విడ్ తలకు రాసి పంపించాడు.ఆ లిక్విడ్ ఆరిపోకుండా తలపై బట్ట కట్టుకొని నీళ్లు చల్లుతూ ఉండమంటూ సూచనలు ఇచ్చాడు.కొందరు సెలబ్రిటీల పేర్లు వాడుతూ, వారికీ కూడా జుట్టు మొలిపించాను అంటూ నమ్మకం కలిగించాడు.

Telugu Baldness, Biggboss, Scam, Victims, Fraud, Hyderabad, Liquid Scam, Medical

కొన్ని రోజుల్లోనే తలపై మంటలు రావడం ప్రారంభమైంది.నెమ్మదిగా బొబ్బలు, పుండ్లుగా మారడంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెట్టారు.పలువురు చెబుతున్నదాని ప్రకారం, నెత్తిపై ఉన్న కొద్దిపాటి జుట్టు కూడా ఊడి పోయిందట.ఆరోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా, మానసిక వేదనలో పడిపోయారు.ఈ మొత్తం వ్యవహారం పూర్తిగా నకిలీ అని అర్థమైన తరువాత, వకీల్ అనే వ్యక్తి డబ్బులు మూటగట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా పారిపోయాడనీ కామెంట్ చేస్తున్నారు.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.

ఇప్పటికే పాతబస్తీలో ఇది పెద్ద సంచలనంగా మారింది.

Telugu Baldness, Biggboss, Scam, Victims, Fraud, Hyderabad, Liquid Scam, Medical

ఇలాంటి నకిలీ ప్రచారాలపై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.నమ్మదగని ప్రకటనలు, అనుమానాస్పద ట్రీట్‌మెంట్‌లకు దూరంగా ఉండాలి.వైద్య సంబంధిత సమస్యల కోసం అనధికారికంగా ఎవరి మాటలు నమ్మకుండా, గుర్తింపు పొందిన వైద్యులను మాత్రమే సంప్రదించడం మంచిది.

లేదంటే, లేని జుట్టుకోసం వెతుకుతూ ఉన్న జుట్టును కూడా కోల్పోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube