మెగా కోడలు ఉపాసన (Mega daughter-in-law worship)గురించి ప్రేక్షకులకు కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఉపాసన చరణ్(Upasana Charan) ను ప్రతి విషయంలో సపోర్ట్ చేయడంతో పాటు బిజినెస్(Business) లో సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
కూతురు క్లీంకార విషయంలో ఉపాసన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎక్కువగా పెరిగానని నా కూతురు కూడా అలాగే పెరగాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అదొక అందమైన అనుభవమని ఆమె కామెంట్లు చేశారు.
నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టమని అందరితో కలిసి ఉండాలని నేను భావిస్తానని ఆమె తెలిపారు.మా అత్త మామ జాగ్రత్తగా చూసుకుంటారని నేను కూడా వాళ్లతో ఉండాలని భావిస్తానని ఆమె తెలిపారు.

నా కూతురు ప్రస్తుతం మంచి వ్యక్తుల చేతుల్లో ఉందని మా కుటుంబం, మా మామయ్య కుటుంబం క్లీంకారను జాగ్రత్తగా పెంచుతున్నారని ఆమె తెలిపారు.క్లీంకార గురించి ఉపాసన చేసిన కామెంట్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.జాయింట్ ఫ్యామిలీ కల్చర్, గ్రాండ్ పేరెంట్స్ గొప్పదనం గురించి ఉపాసన చెప్పిన విషయాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.క్లీంకార రాకతో(Klin Kaara) నా జీవితం ఎంతో ప్రత్యేకంగా మారిందని ఆమె పేర్కొన్నారు.
చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ది సినిమాతో ఈ హీరో బిజీగా ఉన్నారు.చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.రామ్ చరణ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చరణ్ ఉపాసన ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.